🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
భక్తుడి విరాళం – ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు
స్థానిక ప్రముఖ ఇలవేల్పు, మావుళ్లమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్టుకు భక్తులు తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఈ క్రమంలో భీమవరానికి చెందిన మంగిన గురుమూర్తి నాయుడు 8 గ్రాముల బంగారాన్ని విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి దాతకు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం శేషవస్త్రాన్ని అందజేసి సత్కరించారు. ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, పాపోలు ఏడుకొండలు అమ్మవారి ప్రసాదంతో పాటు జ్ఞాపికగా ఫొటోను అందజేశారు.
అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్టు కోసం భక్తులు, దాతలు స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తున్నారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

