The Desk… Chintalapudi : ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బిజీ పర్యటన సాగిందిలా..!

The Desk… Chintalapudi : ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బిజీ పర్యటన సాగిందిలా..!

🟡 ఏలూరు జిల్లా : చింతలపూడి : ది డెస్క్ :

జాతర ఉత్సవాల నుంచి సంతాప సభల వరకు.. వివాహ, శుభకార్యాల్లో పాల్గొని ప్రజలతో మమేకం

చింతలపూడి నియోజకవర్గంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆదివారం విస్తృతంగా పర్యటించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కుటుంబ పరామర్శలు, సంతాప సభలు, విగ్రహావిష్కరణ కార్యక్రమాలతో పాటు పలు వివాహాది శుభకార్యాల్లో పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు.

అమ్మవార్లకు ప్రత్యేక పూజలు :

ఉదయం లింగపాలెం మండలం అయ్యపరాజుగూడెం గ్రామానికి చేరుకున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శ్రీ బంగారమ్మ తల్లి, శ్రీ పిడుగులమ్మ తల్లి అమ్మవార్ల జాతర మహోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, జాతర ఉత్సవాలు ఘనంగా సాగాలని ఆకాంక్షించారు.

టీడీపీ నేత కుటుంబానికి పరామర్శ :

అనంతరం ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన లింగపాలెం మండలం మఠంగూడెంకు చెందిన టీడీపీ నేత ఘంటా సాయి కృష్ణ కుటుంబ సభ్యులను ఎంపీ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

రైతు నాయకుడు కంఠమనేని సత్యనారాయణకు నివాళి :

కామవరపుకోట మండలం కంఠమనేనివారిగూడెంలో నిర్వహించిన రైతు నాయకుడు, ఎర్రకాలువ ఎత్తిపోతల పథకం సంఘం చైర్మన్ కంఠమనేని సత్యనారాయణ విగ్రహావిష్కరణ కార్యక్రమం, సంతాప సభలో ఎంపీ పాల్గొన్నారు. ఆయన సేవలను స్మరించుకుంటూ విగ్రహానికి నివాళులర్పించారు.

శుభకార్యాల్లో పాల్గొని ఆశీర్వచనాలు :

పర్యటనలో భాగంగా మార్గమధ్యంలో పలు వివాహాది శుభకార్యాలు, నూతన వస్త్ర బహుకరణ కార్యక్రమాలకు ఎంపీ హాజరయ్యారు. రామానుజపురం గ్రామ మాజీ సర్పంచ్, టీడీపీ నాయకురాలు అడపా నాగలక్ష్మి దంపతుల కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఏలూరులో నిశ్చితార్థ వేడుకకు హాజరు :

సాయంత్రం ఏలూరు పట్టణానికి చేరుకున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్, చాటపర్రుకు చెందిన టీడీపీ నేత, మాజీ ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్ కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు. కాబోయే దంపతులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ఆధ్యాత్మిక, సామాజిక, సంతాప, శుభకార్యాల్లో పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పర్యటన ఆద్యంతం బిజీగా సాగింది.