🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ నియోజకవర్గం : ది డెస్క్ :
నేడు నందిగామ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో…ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి పాల్గొని విస్తృతంగా పర్యటించారు.
పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో మెగా రక్తదాన శిబిరం :
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కంచికచర్లలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆమె కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ :
రక్తదానం మహోన్నతమైన సేవ అని, ఒక్క యూనిట్ రక్తం ఆపదలో ఉన్న నిండు ప్రాణాన్ని కాపాడగలదని ఆమె పేర్కొన్నారు.
స్వచ్ఛందంగా రక్తదానం చేసిన వారిని అభినందిస్తూ సర్టిఫికెట్లు అందజేశారు. రక్తదాతలకు హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేసి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే :
వీరులపాడు మండలం జయంతి గ్రామం నందు ఆదివారం నాడు పడిగల శ్రీనివాసరావు కుమారుడి వివాహ మహోత్సవానికి కూటమి నేతలతో కలిసి హాజరై…నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.
యండ్రపల్లి కృష్ణారావు విగ్రహావిష్కరణ :
వీరులపాడు మండలం పల్లంపల్లి గ్రామంలో మాజీ నీటి సంఘం అధ్యక్షులు యండ్రపల్లి కృష్ణారావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆమె కూటమి నేతలతో కలిసి పాల్గొని నివాళులర్పించారు.
గ్రామీణాభివృద్ధి, రైతుల సంక్షేమానికి కృష్ణారావు చేసిన సేవలు చిరస్మరణీయమని, కూటమి ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, సాగునీరు, రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. నందిగామ నియోజకవర్గంలోని గ్రామాలకు అవసరమైన మౌలిక వసతులు, సాగునీటి సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే :
చందర్లపాడు మండలం కోనయపాలెంలో..పోతుమర్తి కొండలు మనవరాలు మరియు నంబుల వలరాజు కుమారుడి వివాహమైన సందర్భంగా…నూతన వధూవరులను వారి మరి గృహానికి వెళ్లి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
చందర్లపాడులో :
రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి–సంక్షేమం ఎమ్మెల్యే సౌమ్య ప్రజలకు వివరిస్తూ.. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను పలకరిస్తూ, నందిగామ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. స్థానిక అవసరాలు, సమస్యలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే సౌమ్య తెలిపారు.
భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం :
అంబా కోచ్ అధినేత వల్లభనేని రామకృష్ణ–అనురాధ దంపతుల ఆహ్వానం మేరకు.. సత్యనారాయణ స్వామి వ్రతం పూజా కార్యక్రమంలో కూటమి నేతలతో కలిసి పాల్గొని, స్వామి ఆశీస్సులతో వల్లభనేని దంపతులను, కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
నెల్లూరి వారి నూతన వస్త్ర బహూకరణ వేడుకలో :
గుడిమెట్ల గ్రామంలో ఆదివారం నాడు తెదేపా నేత నెల్లూరి వెంకటేశ్వరరావు మనమరాల నూతన వస్త్ర బహుకరణ వేడుకకు వారి కుటుంబ సభ్యులతో కలసి చిరంజీవిలు రీతు మరియు కుందనాను అక్షింతలు వేసి ఆశీర్వదించారు.

