🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :
రైతులకు సేంద్రియ ఎరువుల పంపిణీ
రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలి
➖ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
నందిగామ మార్కెట్ యార్డులో శనివారం రైతులకు సేంద్రియ ఎరువులను పంపిణీ చేశారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మార్కెట్ యార్డు పాలకవర్గ సభ్యులు, అధికారులతో కలిసి రైతులకు ఎరువులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ :
సేంద్రియ ఎరువుల వినియోగంతో భూసారం పెరగడంతో పాటు సూక్ష్మజీవుల అభివృద్ధి, పంటలకు అవసరమైన పోషకాల లభ్యత మెరుగుపడుతుందని తెలిపారు. రసాయన ఎరువులపై అధిక ఆధారపడకుండా, భూసార పరీక్షల ఆధారంగా సమతుల్య ఎరువుల వినియోగంతో సుస్థిర వ్యవసాయం సాధ్యమవుతుందని సూచించారు.
“మన భూమి–మన బాధ్యత” అనే స్ఫూర్తితో వ్యవసాయ భూముల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, రైతు సంక్షేమానికి ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తోందని ఎమ్మెల్యే సౌమ్య పేర్కొన్నారు.

