🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
యువతకు అనుభవమే తొలి మెట్టు
దొరికిన అవకాశాన్ని వదులుకోవద్దు
ఉద్యోగ మేళాలను సద్వినియోగం చేసుకోండి
➖ఎమ్మెల్యే చంటి
విద్యార్హతలకు తగిన ఉద్యోగం లభించే వరకు యువత దొరికిన ఉద్యోగాల్లో పనిచేస్తూ అనుభవాన్ని సంపాదించుకోవాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. తద్వారా ఆర్థిక స్వావలంబనతో పాటు భవిష్యత్తుకు అవసరమైన అనుభవం కూడా లభిస్తుందని అన్నారు.
ఏలూరు అశోక్‌నగర్‌లోని కేపీడీటీ హైస్కూల్ ఆడిటోరియంలో శనివారం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేళాను ఆయన సందర్శించారు. అభ్యర్థుల నమోదు ప్రక్రియను పరిశీలించి, వివిధ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా నిరుద్యోగ యువతలో ధైర్యం నింపిన ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :
కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఇటువంటి ఉద్యోగ మేళాలను యువత సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని పిలుపునిచ్చారు.

