The Desk … Nandigama : ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం➖ ఎమ్మెల్యే సౌమ్య

The Desk … Nandigama : ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం➖ ఎమ్మెల్యే సౌమ్య

🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :

వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే సౌమ్య

ప్రజల వద్దకే పాలన

సమస్యలకు సత్వర పరిష్కారం

ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే స్పందన

ప్రజా దర్బార్ – ప్రజలతో మమేకం

ప్రజల సమస్యల పరిష్కారానికే కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఆమె ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు.

వినతుల్లో పేర్కొన్న సమస్యలను అడిగి తెలుసుకుని, సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ :

ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సౌమ్య తెలిపారు.