🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ నియోజకవర్గం : కంచికచర్ల :
ఐదేళ్ల నిరీక్షణకు తెర.. మెగా డీఎస్సీతో కొలువు
కష్టానికి ఫలితం.. మెగా డీఎస్సీతో ఉపాధ్యాయ కొలువు
మెగా డీఎస్సీ.. మా జీవితాల్లో వెలుగులు
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు ఉపాధ్యాయుల కృతజ్ఞతలు
కొలువుల తల్లులను ప్రత్యేకంగా అభినందించిన “ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య”
ఐదేళ్లుగా నోటిఫికేషన్ కోసం ఎదురుచూసిన నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల కలను 2024 మెగా డీఎస్సీ సాకారం చేసిందని ఎన్టీఆర్ జిల్లా పరిటాల గ్రామానికి చెందిన నూతన ఉపాధ్యాయులు ప్రియాంక, స్రవంతి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి, పారదర్శకంగా ఎంపికలు, ధ్రువపత్రాల పరిశీలన, పోస్టింగ్ ప్రక్రియ నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ :
మెగా డీఎస్సీలో ఎస్‌జీటీగా ఎంపికై ప్రస్తుతం చందర్లపాడు మండలం ముప్పాళ్లలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్లుగా నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తూ ఎంతో కష్టపడి చదివామని, తమ నిరీక్షణకు మెగా డీఎస్సీతో ఫలితం లభించిందన్నారు.
ఈ సందర్భంగా స్రవంతి మాట్లాడుతూ :
2019లో తన కోర్సు పూర్తయిందని, ఐదేళ్లపాటు కష్టపడి చదివిన అనంతరం 2024 మెగా డీఎస్సీ ద్వారా విజయవాడ కార్పొరేషన్‌లో ఎస్‌జీటీగా ఉద్యోగం సాధించానని తెలిపారు. ఎలాంటి లోపాలకు తావులేకుండా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించినందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

