🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :

రాఖీలతో సందడిగా ఎంపీ కార్యాలయం
రాఖీ కట్టిన విద్యార్థినులు
ఆశీర్వాదం తీసుకున్న సోదరీమణులు
రాఖీ పౌర్ణమి సందర్భంగా.. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ కార్యాలయంలో సందడి నెలకొంది. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినులు, మహిళా కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎంపీకి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. జడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ కూడా ఎంపీకి రాఖీ కట్టారు. రాఖీలు కట్టిన వారికి ఎంపీ మిఠాయిలు తినిపించి, అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.
నూతన క్యాంపు కార్యాలయంలో వినతుల స్వీకరణ :
వట్లూరు పంచాయతీ సీతాపురం కాలనీ (రాఘవ ఎస్టేట్స్)లో నూతనంగా నిర్మించిన నివాసం, క్యాంపు కార్యాలయంలో ఎంపీని పలువురు నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గాలు, మండలాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించిన ఎంపీ.. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.

