The Desk … Vundrajavaram : ▪️స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర▪️

The Desk … Vundrajavaram : ▪️స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర▪️

🔴 తూగో జిల్లా : ఉండ్రాజవరం మండలం : కాల్దరి: ది డెస్క్ :

కాల్దరి గ్రామ పంచాయతీలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా.. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు.

రహదారులు, వీధులు, బహిరంగ ప్రదేశాలు, కాలువలు, చెరువులను శుభ్రం చేసి చెత్త పేరుకుపోయే ప్రాంతాలను తొలగించారు.

ఇంటింటి చెత్త సేకరణ, తడి–పొడి చెత్త వేరు చేయడం, పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజా మరుగుదొడ్ల శుభ్రత, పచ్చదనం, పరిసరాల సుందరీకరణకు చర్యలు చేపట్టారు. కార్యక్రమాల్లో స్వయం సహాయక సంఘాలు, యువజన సంఘాలు, ప్రజలు భాగస్వాములు కావాలని అధికారులు సూచించారు.

ఈ కార్యక్రమంలో కాల్దరి గ్రామ కార్యదర్శి శ్రీనివాస్, కూటమి నాయకులు, ప్రజలు, పంచాయితీ సిబ్బంది, స్వర్ణ గ్రామ సిబ్బంది, హెల్త్ మరియు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.