🔴 కోనసీమ జిల్లా : రావులపాలెం : ది డెస్క్ :

రావులపాలెం గ్రామ పంచాయతీలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా.. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు.
రహదారులు, వీధులు, బహిరంగ ప్రదేశాలు, కాలువలు, చెరువులను శుభ్రం చేసి చెత్త పేరుకుపోయే ప్రాంతాలను తొలగించారు.
ఇంటింటి చెత్త సేకరణ, తడి–పొడి చెత్త వేరు చేయడం, పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజా మరుగుదొడ్ల శుభ్రత, పచ్చదనం, పరిసరాల సుందరీకరణకు చర్యలు చేపట్టారు. కార్యక్రమాల్లో స్వయం సహాయక సంఘాలు, యువజన సంఘాలు, ప్రజలు భాగస్వాములు కావాలని అధికారులు సూచించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు అమలాపురం పార్లమెంటరీ తెలుగు యువత అధ్యక్షులు చిలువూరి వెంకట సత్యనారాయణ రాజు, రావులపాలెం నీటి సంఘం అధ్యక్షులు కొవ్వూరి వెంకట సత్యనారాయణ రెడ్డి, రావులపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొవ్వూరు అచ్చిరెడ్డి, రావులపాలెం సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు గుత్తుల పట్టాభి రామారావు, జిల్లా పరిషత్ బాలికల పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కోట సోమేశ్వరరావు, రావులపాలెం జనసేన పార్టీ అధ్యక్షులు అంబటి కిషోర్, జోగి శ్రీనివాసరావు, జక్కంపూడి లక్ష్మీనారాయణ, మేడపాటి కాసు రెడ్డి, గ్రామ పెద్దలు, ప్రజలు, గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రసాద్ మరియు సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

