🟡 ఏలూరు జిల్లా: ఏలూరు : ది డెస్క్ :

50వ డివిజన్‌లో రోడ్లు, డ్రైన్ల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
“డోర్ టు డోర్” కార్యక్రమంలో భాగంగా… ఎమ్మెల్యే బడేటి చంటి
ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ ఇంటింటి ప్రచార కార్యక్రమం ఆదివారం 50వ డివిజన్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి, నగర మేయర్ షేక్ నూర్జహాన్ పాల్గొని ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :
రోడ్లు, డ్రైన్ల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని, పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో దెబ్బతిన్న మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.

నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ :
ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

