The Desk … Eluru : 17వ డివిజన్‌లో రూ.14.90 లక్షలతో సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులకు శ్రీకారం

The Desk … Eluru : 17వ డివిజన్‌లో రూ.14.90 లక్షలతో సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులకు శ్రీకారం

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
➖ఎమ్మెల్యే చంటి

ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. నగరంలోని 17వ డివిజన్ నందిగం వారి సందులో సాఫ్ట్‌లోన్ నిధులు రూ.14.90 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు.

సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :

డివిజన్‌ల వారీగా ప్రాధాన్యతా క్రమంలో రహదారుల అభివృద్ధి కొనసాగుతోందన్నారు. స్థానికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గాంధీధ్యాన మందిర్ రోడ్డును కూడా నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రహదారిని 60 అడుగులకు విస్తరించే అంశంపై ప్రజలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతో స్థానికులు ఎమ్మెల్యే బడేటి చంటికి కృతజ్ఞతలు తెలిపారు.