🟡 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్:
విద్యార్థులు ఒత్తిడికి లోనుకావద్దు
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మనోధైర్యం నింపాలి
➖ఎంపీ పుట్టా మహేష్ కుమార్
పోలవరం జిల్లా ఈర్లపల్లికి చెందిన పదో తరగతి విద్యార్థిని ముర్రం శివాని ఆత్మహత్య ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఉన్న ఆయన సోమవారం విడుదల చేసిన ప్రకటనలో, ఇటీవల రంపచోడవరంలో జరిగిన మెగా పేరెంట్–టీచర్ సమావేశంలో ధైర్యంగా మాట్లాడి అందరి ప్రశంసలు పొందిన శివాని మృతి బాధాకరమన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా విద్యార్థులు ఆత్మహత్యల వంటి నిర్ణయాలకు పాల్పడవద్దని, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందన్నారు. పిల్లల్లో మనోధైర్యాన్ని పెంపొందించే బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందని సూచించారు. ఘటనకు కుటుంబ సమస్యలే కారణమని వార్తలు వస్తున్న నేపథ్యంలో అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని పోలీసులను కోరినట్లు తెలిపారు.

