🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం : ది డెస్క్. :
ఎమ్మెల్యే బడేటి చంటి పరిశీలన – అర్హులకు వైద్య సేవలు
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి గురువారం నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరం స్థానిక పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొనసాగింది. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి శిబిరాన్ని పరిశీలించి వైద్య సేవల తీరును తెలుసుకున్నారు. శిబిరంలో పాల్గొన్న ప్రజలకు ఉచిత రక్త పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజలకు మరింత చేరువగా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. దాతల సహకారంతో విద్యా, వైద్య సేవలను విస్తృతం చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు కొనసాగుతాయని ఆయన చెప్పారు.
Free Medical Camp Conducted with Public Service as the Primary Objective
MLA Badeti Chanti Inspects Camp; Medical Services Provided to Eligible Beneficiaries
A free medical camp, being organized every Thursday with the objective of providing quality healthcare services to the public, was conducted at the MLA Camp Office in Powerpet, Eluru. District Telugu Desam Party President and Eluru MLA Badeti Chanti inspected the camp and reviewed the medical services being provided.
As part of the camp, participants underwent free blood tests, and necessary medicines were distributed at no cost.
Speaking on the occasion, MLA Chanti said :
The camp is being conducted in accordance with the directions of Chief Minister N. Chandrababu Naidu to ensure that public services reach people more effectively. He stated that educational and healthcare initiatives are being expanded with the support of donors and well-wishers. He further emphasized that efforts will continue to ensure better medical facilities and quality healthcare services for the people.

