- 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో 7508 కోట్లు జమ
ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ : THE DESK NEWS :

విజయవాడలోని సివిల్ సప్లై భవన్ లో రైస్ మిల్లర్స్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై, మిల్లర్లతో సమావేశం నిర్వహించారు.
5.21 లక్షల మంది రైతుల నుంచి 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
7522 కోట్ల రూపాయలు విడుదల – 24 గంటల్లోనే 7508 కోట్లు రైతుల ఖాతాల్లో జమ
30 వేల లారీలు, ధాన్యం సేకరణలో పాల్గొన్న 37 వేల మంది హమాలీలు
టెక్నాలజీ వాడకంతో తొలిసారిగా వాట్సాప్ ద్వారా ధాన్యం కొనుగోలు (7337359375)
పేపర్‌లెస్ అడ్మినిస్ట్రేషన్ – త్వరలో ఆన్‌లైన్ సిస్టమ్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
PDS దుర్వినియోగం నిరోధానికి చర్యలు – PD Act కింద కేసులు నమోదు
రైతు సేవా కేంద్రాలు & మిల్లర్ల తేమ మిషన్లలో వ్యత్యాసం లేకుండా చర్యలు
నాణ్యమైన గన్ని బ్యాగుల అందుబాటు కోసం చర్యలు
FCI నిధుల కోసం ప్రభుత్వ మద్దతు–
మిడ్ డే మీల్స్, వెల్ఫేర్ హాస్టళ్లకు మంచి బియ్యం అందించనున్న ప్రభుత్వం నిర్ణయం పట్ల రైస్ మిల్లర్స్ హర్షం వ్యక్తం
“ఈ సమావేశం క్షేత్రస్థాయిలో సమస్యలు అర్థం చేసుకోవడానికే ఏర్పాటు చేసాం.
రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు.
“గత ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం తక్కువ సమయంలోనే అధిక ధాన్యం కొనుగోలు చేసింది. భవిష్యత్తులో మరింత వేగంగా, పారదర్శకంగా కొనుగోలు కొనసాగిస్తాం.”
సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ ఐఏఎస్, మేనేజింగ్ డైరెక్టర్ మనజీర్ జిలానీ ఐఏఎస్, రాష్ట్రంలోని రైస్ మిల్లర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.