తూర్పు గోదావరి జిల్లా : ఉండ్రాజవరం మండలం : తాడిపర్రు : THE DESK :
తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో సోమవారం తెల్లవారుజాము విషాద సంఘటన చోటుచేసుకుంది. వివరాలిలావున్నాయి…
గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ఆది నుండి వివాదాలమయమైంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణను లేవదీసింది. చివరికి జిల్లా కలెక్టర్, ఆర్డిఓ వంటి ఉన్నతాధికారుల చొరవతో సమస్య తీరింది.
ఎట్టకేలకు సోమవారం విగ్రహావిష్కరణ, అన్న సమారాధన కు ఏర్పాటు చేసుకున్నారు నిర్వాహకులు. ఈ ఏర్పాట్లే నలుగురి ప్రాణాలను బలిగొంది.
భారీ ఏర్పాట్ల నేపద్యంలో ఫ్లెక్సీలు కడుతున్న నలుగురు యువకులకు కరెంట్ షాక్ తగిలి, బొల్లా వీర్రాజు (25), కాశగాని కృష్ణ (23), పామర్తి నాగేంద్ర (25), మారిశెట్టి మణికంఠ పెద్దయ్య(29) సంఘటన స్థలం లోనే మరణించారు.
మరో వ్యక్తి కోమటి అనంత రావు తీవ్రంగా గాయపడ్డాడు. వీరి ఇరువురిని హుటాహుటిన తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సోమవారం తెల్లవారుజాము మూడు గంటలకు జరిగిన ఈ దుస్సంఘటనతో గ్రామంతో పాటు యావత్ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.