ఏలూరు జిల్లా : కైకలూరు/ఉంగుటూరు : ది డెస్క్ :
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉంగుటూరులో పర్యటించారు. పర్యటనలో భాగంగా ముందుగా హెలిపాడ్ వద్ద కైకలూరు శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ తో కలిసి వివిధ శాఖల మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు, ప్రముఖులు తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మిషన్ హరితాంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో కొల్లేరు సమస్యపై సీఎం చంద్రబాబు కు క్లుప్తంగా వివరించారు.
కార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి డా. కొలుసు పార్ధసారధి, రాష్ట్ర పౌర సరఫరాల, వినియోగదరుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఉంగుటూరు శాసనసభ్యుడు పత్సమట్ల ధర్మరాజు , దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్, ఏలూరు శాసనసభ్యడు బడేటి రాధాకృష్ణయ్య, చింతలపూడి శాసనసభ్యుడు సొంగ రోషన్ కుమార్, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

