The Desk…Mudinepalli : బాల్యవివాహాన్ని అడ్డుకున్న ముదినేపల్లి పోలీసులు

The Desk…Mudinepalli : బాల్యవివాహాన్ని అడ్డుకున్న ముదినేపల్లి పోలీసులు

ఏలూరు జిల్లా, ముదినేపల్లి (ద డెస్క్ న్యూస్) : మైనారిటీ తీరని బాలిక వివాహాన్ని ముదినేపల్లి పోలీసులు అడ్డుకున్నారు. గురువారం మండలంలోని గురజ గ్రామంలో గల వేణుగోపాలస్వామి దేవస్థానంలో మైనర్ వివాహం జరుగుతుందన్న సమాచారం అందడంతో ఎస్ఐ డి. వెంకట్ కుమార్ ఆదేశాలతో సిబ్బంది వివాహ వేదికకు వెళ్లి విచారణ జరుపగా సదరు పెళ్లికూతురు వయసు 17 సంవత్సరాల 2 నెలలు గా తేలిందన్నారు. ఈ వివాహంపై ఇరు వర్గాల వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పెళ్లిని నిలిపివేసినట్టు ఎస్ఐ తెలిపారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని.. అటువంటి వివాహాలు చేసిన ఎడల కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.