The Desk…Mandavalli : ముళ్ళపూడికి ఎమ్మెల్సీ జయమంగళ, కూటమి నేత చాపరాల పరామర్శ

The Desk…Mandavalli : ముళ్ళపూడికి ఎమ్మెల్సీ జయమంగళ, కూటమి నేత చాపరాల పరామర్శ

ఏలూరు జిల్లా : మండవల్లి : ది డెస్క్ :

తెదేపా నాయకుడు ముళ్ళవూడి సత్తిబాబుకు ఇటీవల కాలి వేలుకు గాయమై షుగర్ వ్యాధి కారణంగా ఇన్ఫెక్షన్ తీవ్ర రూపం దాల్చి మోకాళ్ళ వరకు వ్యాపించింది. దీంతో మూడుసార్లు శస్త్రచికిత్సలు చేయించుకోవలసి వచ్చింది.ఫలితంగా చివరకు మోకాలి పైభాగం వరకు కాలును తొలగించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, కూటమి నాయకులు చాపరాల దుర్గాప్రసాద్ ఆదివారం స్థానిక సత్తిబాబు నివాసానికి వెళ్లి పరామర్శించారు.

సందర్భంగా ఎమ్మెల్సీ జమంగళ మాట్లాడుతూ.. సత్తిబాబు ఎన్డీఏ కూటమి పార్టీ కి ఎంతో కృషి చేశారని, ఆయన త్వరగా కోలుకుని పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. వైద్యుల సూచనలు తప్పకుండా పాటించాలని సత్తిబాబుకు సూచించారు.అలాగే సత్తిబాబు కుటుంబానికి కూటమి అండగా ఉంటుందని.. అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. సత్తిబాబును పరామర్శించిన వారిలో మానవత ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు కొండ్రెడ్డి సత్యనారాయణ, కెరియర్ గైడెన్స్ ప్రొఫెసర్ డాక్టర్ సూదాబత్తుల విజయకుమార్, గుర్రం శ్యామ్ తదితరులు ఉన్నారు.