The Desk…Mandavalli : భైరవపట్నంలో ఘనంగా కూటమి నేత చాపరాల దుర్గాప్రసాద్ జన్మదిన వేడుకలు

The Desk…Mandavalli : భైరవపట్నంలో ఘనంగా కూటమి నేత చాపరాల దుర్గాప్రసాద్ జన్మదిన వేడుకలు

ఏలూరు జిల్లా : మండవల్లి : ది డెస్క్ :

మండలంలోని భైరవపట్నంలో ఎన్డీఏ కూటమి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు చాపరాల దుర్గాప్రసాద్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా నాయకులు, కార్యకర్తల సమక్షంలో దుర్గాప్రసాద్ కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య వేడుకలను ప్రారంభించారు.

అనంతరం ఎన్డీఏ కూటమి నేతలు పెద్ద సంఖ్యలో హాజరై పుష్పగుచ్చాలు అందజేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా దుర్గాప్రసాద్ అభిమానులు ప్రభుత్వాసుపత్రిని సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేసి మానవతా సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

తదుపరి భైరవపట్నంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్‌ను సందర్శించిన దుర్గాప్రసాద్ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. విద్యార్థులు ఆయనకు పుష్పగుచ్చం పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యే భవిష్యత్తుకు పునాది అని పేర్కొంటూ, విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని మండలవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ప్రజాసేవే లక్ష్యంగా చాపరాల దుర్గాప్రసాద్ నిరంతరం పనిచేస్తూ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని ప్రశంసలు కురిపించారు.