ఏలూరు జిల్లా : కలిదిండి : ది డెస్క్ :

కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి మండల కేంద్రం భోగేశ్వరలంకలో స్వయంభుగా వెలసి భక్తులచే ఆరాధించబడుతున్న శ్రీ పార్వతీ సమేత శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి వారి వార్షిక మహాశివరాత్రి మహోత్సవాలు ఈనెల 13వ తేదీ శుక్రవారం నుండి 17వ తేదీ మంగళవారం వరకు ఆలయ చైర్మన్ అడివి శివప్రసాద్, ధర్మకర్తల మండలి పరివేక్షణలో ఆలయ కార్యనిర్వహణ అధికారి శింగనపల్లి శ్రీనివాసరావు నిర్వహణలో అత్యంత వైభవంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈనెల 13వ తేదీ సాయంత్రం అంకురార్పణతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని 14వ తేదీ స్థిరవారం రాత్రి 1.20 నిమిషములకు ఆలయ చైర్మన్ అడివి శివప్రసాద్ శ్రీమతి రామలక్ష్మి దంపతులచే శ్రీ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడును. శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవానికి కైకలూరు శాసనసభ్యులు, మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, ధర్మపత్ని మనోరమ దంపతులు శ్రీ స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పిస్తారు.

15వ తేదీ ఆదివారం మహాశివరాత్రి తీర్థం రాత్రి 8 గంటలకు తపస్సు చెరువు నందు శ్రీ స్వామివారి తేప్పోత్సవం ప్రత్యేక హంస వాహనంపై నిర్వహించబడును. 16వ తేదీ సోమవారం శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు 17వ తేదీ మంగళవారం రాత్రి పవళింపు సేవతో శ్రీ స్వామివారి ఉత్సవాలు ముగిస్తాయ రాత్రులు పలు ఆధ్యాత్మిక వినోదాత్మగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని, దర్శనార్థం ఇచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విఐపి దర్శనం, స్పెషల్ దర్శనం మరియు ఉచిత దర్శనం ఏర్పాటు చేశామని భక్తులకు త్రాగునీరు మజ్జిగ ఉచిత ప్రసాదం తదితరు.
ఏర్పాటు చేశామని దర్శనార్థం ఇచ్చే భక్తులకి ఆయా అన్న సమారాధన కమిటీలు ద్వారా అన్న ప్రసాద వితరణ నిర్వహించబడనని, మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్లు, పురుషులకు మరుగుదొడ్లు, పిండ ప్రధానం నిర్వహించే వారికి తపస్సు చెరువు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పంచ బుగ్గల కోనేరు నందు స్థానమాచరించి శ్రీ స్వామివారి దర్శనార్థం విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకావాలన్నారు. మహాశివరాత్రికి శ్రీ స్వామివారి దర్శనార్థం పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు వస్తారని ఆలయ ఈవో శింగనపల్లి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు .

