The Desk…Kaikaluru : మాజీ సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలపై బిఎస్సార్ మండిపాటు

The Desk…Kaikaluru : మాజీ సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలపై బిఎస్సార్ మండిపాటు

బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నేత బిఎస్సార్

ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

బీసీ సామాజికవర్గానికి చెందిన మాజీ ఉన్నతాదికారులు కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ పి.కృష్ణయ్య, సీనియర్ ఐపీఎస్ అధికారి జి.గోపీనాథను అవమానిస్తూ వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూరుబోయిన శ్రీనివాసరావు (BSR) సోమవారం ఓ ప్రకటనలో ఖండించారు.

మాజీ ఐఏఎస్, బీసీ సామాజిక వర్గానికి చెందిన కృష్ణయ్య యాదవ్ , ఐపీఎస్ అధికారి గోపీనాథ్ జెట్టిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి యాదవులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గోపీనాథ్ జెట్టి, కృష్ణయ్యలను “వాడు.. వీడు” అంటూ సంబోధించడం ఎంత వరకు సమంజసమని ఆయన నిలదీశారు. జగన్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, క్షమాపణ చెప్పాలని (బిఎస్సార్) డిమాండ్ చేశారు. జగన్ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే పోరాటాన్ని ఉదృతం చేస్తామని బిఎస్సార్ హెచ్చరించారు.