ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

విద్యుత్ అల్పవలయం ప్రమాదంలో ఇల్లు కాలి సర్వం కోల్పోయిన బాధిత పేద కుటుంబానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టిడిపి నాయకుడు బూరుబోయిన శ్రీనివాసరావు (BSR) అండగా నిలిచి సాయం అందించారు.
మండలంలోని ఆచవరం గ్రామానికి చెందిన బుర్ల రామస్వామి ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లు పూర్తిగా కోల్పోవడంతో.. విషయం తెలుసుకున్న BSR శనివారం సంఘటనా స్థలానికి వెళ్లి ఆస్తి నష్టానికి గల కారణాలను అడిగి తెలుసుకొన్నారు. బాధిత కుటుంబానికి ఆయన ఆర్థిక సాయం అందించారు.
ఈ సందర్భంగా BSR మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. పేద కుటుంబాన్ని ఆదుకునేందుకు అందరూ తమవంతు సాయం అందించాలని కోరారు.
అయన వెంట మాజీ సర్పంచ్ మాడపాటి చింతయ్య, బోడావుల వడ్డీ కాసులు, బుర్ల పోతురాజు, బూరుబోయిన పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.

