The Desk…Kaikaluru : వ్యర్థాలు పేరుకుని దుర్వాసన… చెత్త తొలగించాలని స్థానికుల విజ్ఞప్తి

The Desk…Kaikaluru : వ్యర్థాలు పేరుకుని దుర్వాసన… చెత్త తొలగించాలని స్థానికుల విజ్ఞప్తి

ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK :

కైకలూరు పట్టణ నడిబొడ్డున ఉన్న ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ ప్రక్కన రహదారిపై చెత్తాచెదారాలతో, కుళ్లిన వ్యర్ధాలతో నిండి దుర్వాసన వెదజల్లుతుందని స్థానికులు వాపోతున్నారు.

రోజులు తరబడి వ్యర్ధాలను తొలగించకపోవడంతో పలు రకాల పనుల నిమిత్తం బ్యాంకుకు వచ్చే ఖాతాదారులు ముక్కు మూసుకుని వెళ్లాల్సివస్తుందని వాపోతున్నారు.

చుట్టుపక్కల వారు పడవేసిన వ్యర్ధాలను గ్రామపంచాయతీ అధికారులు తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక షాపుల యజమానులు కోరుతున్నారు.

వర్షాలు పడినప్పుడు మురుగు కాలువలు ముంపునకు గురై వ్యర్ధాలు రోడ్లపై చెల్లాచెదురుగా ఉంటున్నాయని, వాటి వల్ల ప్రాణాంతక డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు బారిన పడతామని అక్కడి షాపులవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బ్యాంకు పైనే “ప్రభుత్వ బి.సి కళాశాల బాలికల వసతి గృహం” ఉండటం గమనార్హం.

వెంటనే పంచాయతీ అధికారులు స్పందించి దుర్వాసన వెదజల్లుతున్న చెత్తను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

ఈ విషయమై కైకలూరు పంచాయతీ సెక్రటరీ గోపాలరావును వివరణ కోరగా.. సదరు సమస్య తన దృష్టికి రాలేదని, వెంటనే సిబ్బందిని పంపి చెత్తను తొలగించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.