ఏలూరు జిల్లా : మండవల్లి : The Desk : ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో కొల్లేరు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. దీంతో విషయం తెలుసుకున్న రాష్ట్ర శాసనమండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ సోమవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మండల శివారు ప్రాంతంలోగల పెద్దఎడ్లగాడి వంతెనను జయమంగళ పరిశీలించారు. అనంతరం పెనుమాకలంక గ్రామానికి వెళ్లే రహదారి రాకపోకలు ముంపునకు గురై రాకపోకలు స్తంభించడంతో మండవల్లి తాసిల్దార్ కు ఫోన్ చేసి గ్రామస్తుల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా బోట్లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ ఆదేశించారు. ఆయన వెంట నాయకులు పలువురు వున్నారు.
