The Desk…Guraja : మంచాల బుడ్డియ్య కుటుంబానికి అంబుల వైష్ణవి ఆర్థిక సాయం

The Desk…Guraja : మంచాల బుడ్డియ్య కుటుంబానికి అంబుల వైష్ణవి ఆర్థిక సాయం

ఏలూరు జిల్లా : ముదినేపల్లి : THE DESK NEWS :

మండలంలోని గురజ గ్రామానికి చెందిన మంచాల బుడ్డియ్య (58) అనారోగ్య కారణాలతో మంగళవారం మృతి చెందాడు. అతనికి భార్య, పిల్లలు ఎవరూ లేరు. ఇద్దరు చెల్లెల్లు మాత్రమే ఉన్నారు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి, డా. అంబుల మనోజ్లు స్పందించారు.

గురజ గ్రామానికి వెళ్లి బుడ్డియ్య మృతదేహాన్ని సందర్శించి దహన సంస్కారాల నిమిత్తం రూ.5వేలు ఆర్థిక సాయం అందించారు. అలాగే మరింత మంది దాతలు ముందుకు వచ్చి బుడ్డియ్య కుటుంబానికి సాయమందించాలని వారు కోరారు.