ఏలూరు జిల్లా : దెందులూరు : THE DESK :
అంతర జిల్లాల ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడుతున్న వ్యక్తులను దెందులూరు పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సోమవారం మీడియా ముందు ప్రవేశెట్టారు.
ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్ ఆదేశాలపై, ఏలూరు డిఎస్పీ, నూజివీడు సబ్ డివిజన్ ఇంచార్జ్ డి. శ్రవణ్ కుమార్ పర్యవేక్షణలో పెదవేగి సిఐ K. వెంకటేశ్వరావు, దెందులూరు సబ్-ఇన్స్పెక్టర్ K. స్వామి, సిబ్బంది కలిసి నేర నియంత్రణలో భాగంగా ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా, ప్రకాశం, తూర్పు గోదావరి జిల్లా మరియు గుంటూరు జిల్లా పరిదిలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుచున్న నిందితులను సోమవారం అరెస్టు చేసి సుమారు 25 లక్షల విలువ గల 31 మోటార్ సైకిల్ లను స్వాదినపరుచుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాలప్రకారం….
ఈ కేసులో అరెస్టు కాబడిన మొదటి నిందితుడు పులిగడ్డ జగదీశ్ బాబు చెడు వ్యసనాలకు బానిసై గతంలో పరిచయం అయిన అతని ఏరియాకే చెందిన మోటార్ సైకిల్ మెకానిక్ ఆగడం సూర్య ప్రకాష్ తో కలిసి వంజరపు శ్రీనివాస్, బొడ్డు లక్ష్మణ్ కుమార్ పటాన్ నాగూర్ మీరా, చీకట్ల సతీష్ అను వారితో ఒక గ్రూపుగా ఏర్పడి కారులో వెళ్లి మోటారు సైకిల్ దొంగతనాలు చేయడం జరిగింది. వారిలో చీకట్ల సతీష్ అను అతను ఇప్పటికే వేరే కేసులో అరెస్టు అయ్యి జైలులో ఉన్నాడు. రికవరీ అయిన 31 మోటార్ సైకిళ్ళలో 24 మోటార్ సైకల్ లపై వివిధ పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదయ్యాయి. మిగిలిన 7 మోటార్ సైకల్ ల గురించి వివరాలు తెలియరాలేదు.
పోలీస్ స్టేషన్ వారీగా రికవరీ అయిన మోటార్ సైకల్ ల వివరాలు :
దెందులూరు : 2, కైకలూరు : 1 సింగరాయకొండ : 1, దేవరపల్లి : 2, రాజమండ్రి 2 టౌన్ : 1, తడికలపూడి : 1, గన్నవరం :1, ధర్మాజీగూడెం :1, జంగారెడ్డి గూడెం :1, చేబ్రోలు : 2, తాడేపల్లిగూడెం టౌన్ : 1, ఏలూరు రూరల్ PS : 1, ఏలూరు I టౌన్ : 2, ఏలూరు lI టౌన్ : 2, ఏలూరు Ill టౌన్ : 1, ఆగిరిపల్లి : 2, పెదపాడు : 1, ఇంద్రపాలెం : 1
గుర్తుతెలియని వాహనాలు – 7
చోరీ కాబడిన మోటార్ సైకిళ్ళను రికవరీ చేయడంలో ప్రతిభ చూపిన పెదవేగి సర్కిల్ ఇన్స్పెక్టర్ K. వెంకటేశ్వరావు, దెందులూరు సబ్-ఇన్స్పెక్టర్ K. స్వామి లను, సిబ్బంది HC-1848, A.హమీద్, PC–1179 Ch.పండు, PC-1248 D.చంద్రమౌళి, PC-2296 Ch. సురేష్, PC-2505 K.నాగాంజనేయులు, PC-2531 M. కనకారావు, HG-865 P.రవికుమార్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.