కాకినాడ జిల్లా : ఏలేశ్వరం : THE DESK NEWS :
రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోడి పందేల కొరకు కోడి కత్తులను తయారు చేస్తున్న ఓ వ్యక్తిని ఏలేశ్వరం పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకుని పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆధ్వర్యంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు.
ఈ సమావేశంలో డిఎస్పి మాట్లాడుతూ.. సీఐ బి. సూర్య అప్పారావు కు ఉన్న అక్రమ కోడికత్తుల తయారికి సంబంధించిన సమాచారం మేరకు ఎస్సై ఎన్. రామలింగేశ్వరరావు తన సిబ్బందితో కలిసి ఏలేశ్వరం గ్రామంలోని దిబ్బలపాలెం వీధిలో రైడ్ చేసి ఓ వ్యక్తి నుండి కోడి పందేలకు ఉపయోగించే 160 కోడి కత్తులను స్వాధీనపర్చుకుని, సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
సంక్రాంతి పండుగలు సందర్బంగా జరిగే కోడి పందేలు, జూదం వంటి వాటిని ఆరికట్టుటలో భాగంగా కోడిపందేలు, జూదం నిర్వహించే వారిపైన.. అలాగే, కోడి కత్తులు తాయరీ దారులపైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.
అందులో భాగంగానే అతని వద్ద నుండి కోడి కత్తులను స్వాధీనపర్చుకున్నామని.. ఇది ఒక హెచ్చరిక అని.. అదేవిధంగా ప్రజలు కోడి పందాలు, జూదం వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. కుటుంబ సభ్యులతో కలసి సంక్రాంతి పండుగను జరుపుకోవాలని డి.ఎస్.పి, సీఐ సూర్య అప్పారావు లు ప్రజలకు సూచించారు.