మరణించి 13 సం॥రాలు గడుస్తున్నా… విద్యుత్ సర్వీసును కొనసాగిస్తున్న ఉయ్యూరు టౌన్ విద్యుత్ శాఖ అధికారులు
ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి, ఎ.పి ట్రాన్స్కో, జె.ఎమ్.డి.(విజిలెన్స్) ఆదేశాల మేరకు…
ఉయ్యూరులో విచారణ జరిపిన ఎ.పి.టి.ఎస్.పోలీస్
కృష్ణాజిల్లా : ఉయ్యూరు : ది డెస్క్ :
ఉయ్యూరు మున్సిపాలిటీలో జిల్లా పరిషత్ హైస్కూల్ రోడ్డులో నివసించే శేరు పాండు రంగారావు ది.01.01.2013న మరణించి, ఇప్పటికి 13 సం॥రాలు దాటుతున్నా.. శేరు పాండురంగారావు వారసులు ఎవరూ ఉయ్యూరులో లేనప్పటికి అతనిపేరుతో ఉన్న విద్యుత్ సర్సీస్ నెంబర్ 6711100006971 ఇప్పటికి విద్యుత్ శాఖ ఉయ్యూరు టౌన్ అవినీతి కారణంగా కొనసాగుతుందని, ఇది ఉయ్యూరు టౌన్ విద్యుత్ శాఖ అధికారుల అవినీతికి నిదర్శనమని , ఉయ్యూరు టౌన్ విద్యుత్ శాఖ అధికారుల అవినీతిపై గత నెల అనగా 08.12.2025న ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి విజయానంద్ కు సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస గౌడ్ పిర్యాదు చేశారు.

గత నెలలో ఫిర్యాదు చేసిన కంప్లైంట్ కాపీ
సదరు పిర్యాదుపై ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి ఎ.పి ట్రాన్స్కో, జె.ఎమ్.డి. (విజిలెన్స్ & సెక్యూరిటి ) జి.సూర్య సాయి ప్రవీణ్ చంద్ ను విచారణకు ఆదేశించగా.. ఎ.పి ట్రాన్స్కో, జె.ఎమ్.డి ఆదేశాల మేరకు విజయవాడకు ఎ.పి.టి.ఎస్. పోలీస్ సన్ఇన్స్పెక్టర్ హారిక జెస్సి సిబ్బంది ఆర్.దాస్ హెడ్ కానిస్టేబుల్ సదరు విషయమై విచారించారు.
ఈ కార్యక్రమంలో కొస్తాంధ్ర జిల్లాల యు.ఎఫ్.ఆర్.టి.ఐ నాయకులు బేతపూడి జోగేశ్వరరావు, కృష్ణాజిల్లా కన్వీనర్ బయ్యవరపు దుర్గా ప్రసాద్, తోట్లవల్లూరు మండల కన్వీనర్ మరీదు సాంబశివరావు, ఉయ్యూరు మండల కన్వీనర్ జూల్లా శివపార్వతి, ఆర్టీఐ కార్యకర్త కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Uyyuru Electricity Officials ‘Asleep’ as Dead Man’s Service Runs 13 Years
Despite resident Sheru Pandu Rangarao’s death on January 1, 2013, his electricity connection (No. 6711100006971) at ZP High School Road, Uyyuru Municipality, remains active—allegedly due to corruption at Uyyuru Town Electricity Section.
Social activist Jampana Srinivasa Goud complained to Energy Secretary Vijayananth on December 8, 2025. Following orders from AP Transco JMD (Vigilance) G. Surya Sai Praveen Chand, Vijayawada APTS Police Inspector Harika Jessi and HC R. Das investigated.
Kostandhra districts UFRTAI leaders Betapudi Jogeswar Rao, Krishna convener Bayyavarapu Durga Prasad, and others including Maridu Sambashivaravu, Juulla Shivaparvati, and RTI activist Kiran Kumar attended. This exposes glaring negligence.

