The Desk…Vuyyuru : ఉయ్యూరు కాటూరు రోడ్డులో అనధికార లే-అవుట్లో నిర్మించిన రహదారిపై విచారణకు అధికారుల ఆదేశం

The Desk…Vuyyuru : ఉయ్యూరు కాటూరు రోడ్డులో అనధికార లే-అవుట్లో నిర్మించిన రహదారిపై విచారణకు అధికారుల ఆదేశం

🔴 కృష్ణాజిల్లా : ఉయ్యూరు : ది డెస్క్ :

ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధి లో అనధికార లేఔట్ నందు BT రోడ్డు మరియు CC డ్రైన్ నిర్మాణం పై విజిలెన్స్ విచారణ గురించి ఉయ్యూరు మున్సిపాలిటీ నందు అనధికార లేఔట్ లో GO MS :10 MAUD DT:08.01.2020కి విరుద్ధంగా సుమారు 40 లక్షల రూపాయలతో BT రోడ్డు మరియు CC ໕໓ [1(19)/VNP/GEN/2025-26, 5(6)/VNP/GEN/2025-26] చేసి అనధికార లేఔట్ యజమానికి మేలు జరిగేలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ వి. సత్యనారయణ (నాని) మరియు అధికారుల అవినీతిపై విజిలెన్స్ విచారణ జరిపించగలందుకు రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి.. సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేయగా..

విచారణకు ఆదేశించిన మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి

ఉయ్యూరు మున్సిపాలిటి, కాటూరు రోడ్డులోని రిలయన్స్ ప్రక్కన అనధికార లే-అవుట్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన రహదారిపై విచారణకు ఆదేశించిన మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్. సురేష్ కుమార్…

ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఉప్పుటూరి మురళీ కృష్ణ

“ఉయ్యూరు మున్సిపాలిటి, కాటూరు రోడ్డులోని రిలయన్స్ ప్రక్కన అనధికార లే-అవుట్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన రహదారిపై మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ విచారణకు ఆదేశించారు. ఈమేరకు మున్సిపల్ శాఖ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఉప్పుటూరి మురళీ కృష్ణ ఉత్తర్వులు జారీ చేసారు.మున్సిపల్ శాఖ కమీషనర్ & డైరక్టర్ ను (రాయపూడి) విచారణ చేసి నివేదిక సమర్పించమని ఆఉత్తర్వు లలో ఆదేశించారు.

ది.08.01.2020న జారీ చేసిన జి.ఓ.ఎమ్.ఎస్.నెం. 10లోని నిబంధనలకు విరుద్ధంగా అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడిన చైర్ పర్సన్ వల్లభనేని సత్యనారాయణ (నాని) మున్సిపల్ కౌన్సిల్ని ప్రక్కదారి పట్టించి, తీర్మానం చేసి ఈరహదారిని నిర్మించడం జరిగింది. దాదాపు 40 లక్షలతో రహదారి నిర్మాణం డ్రైన్ల నిర్మాణానికి చైర్ పర్సన్ వల్లభనేని సత్యనారాయణ (నాని) కౌన్సిల్ ఆమోదం పొంది అనధికార లే-అవుట్లలో నిబంధనలను తుంగలో త్రొక్కి, రహదార్లు, డ్రైన్లు నిర్మిస్తూ, వచ్చే ఎన్నికల నిమిత్తం నిధుల సేకరణకు ముందస్తుగానే శ్రీకారం చుట్టారు.

ది.15.12.2025న బి.టి రహదారి నిర్మాణం, సి.సి డ్రైన్ నిమిత్తం టెండర్లలను పిలవటంపై మున్సిపల్ శాఖామంత్రి పొంగూరి నారాయణకి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ కు స్వయంగా కలసి పిర్యాదు చేయటం జరిగినది. కాటూరులో ని సర్వేనెంబర్లు 588,591,604/2,589(పి), 593/3,604/1లోని అనధికార లే-అవుట్లపై గతంలోనే ఉయ్యూరు మున్సిపాలిటి అధికారులు నోటీసులు జారీ చేయటం జరిగింది. రహదారులను జె.సి.బిలతో తొలగించటం జరిగింది. లే అవుట్ యాజమాని నూకల లింగమూర్తి కుటుంబీకులు, పెట్రోలు టిన్నులతో ఆత్మహత్య చేసుకుంటామని రహదారి తొలగింపును నిలుపుదలచేసారని జిల్లా కలెక్టర్ డి.కె బాలజి లోకాయుక్తకి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. గత జనవరిలో లోకాయుక్త ఇన్వెస్టిగేషన్ డిప్యూటి డైరక్టర్ వెంకట రామిరెడ్డి ఈ అనధికార లే- అవుట్లను పరిశీలించి తన నివేదికలను లోకాయుక్తకు సమర్పించటం జరిగింది.