🔴కృష్ణాజిల్లా : ఉయ్యూరు మండలం : ది డెస్క్ :

రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజిని ఆదేశించిన రెవిన్యూ డిపార్ట్మెంట్ జాయింట్ సెక్రెటరీ.3.!!
సామాజిక కార్యకర్త జంపాల శ్రీనివాసగౌడ్ ఫిర్యాదు మేరకు
వివరాల్లోకి వెళితే..
గండిగుంట గ్రామ పంచాయతీలోని సర్వే నెం.218, -219,228/1,228/20,228/22, 226/3,229/2 2 5. 14.38 2 లోని య.1.47 సెంట్ల కామన్ సైట్ రిజిస్ట్రేషన్ కామన్సైట్ల (ప్రభుత్వ భూముల) రిజిస్ట్రేషన్లు రద్దుపై ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ బి.ఆర్.అంబేద్కర్ కు.. రాష్ట్ర రెవిన్యూ శాఖ జాయింట్ సెక్రటరీ ఎన్.శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు.


సర్వే నెం.226/3లోని కామన్సైట్ ను ది.20.05.2014న గండిగుంట గ్రామ వాస్తవ్యులు ప్రస్తుత ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ(నాని) కొనుగోలు చేయగా… అవినీతికి పాల్పడి కామన్ సైట్ను రిజిస్ట్రేషన్ చేసిన అప్పటి ఉయ్యూరు సబ్ రిజిస్ట్రారు ఎమ్. సూర్యనారాయణపై తగిన చర్యలు తీసుకోమని, కామన్సైట్ రిజిస్ట్రేషనను రద్దు పరచి, గండిగుంట గ్రామ పంచాయతీకి స్వాధీనం చేయమని రెవిన్యూశాఖ ముఖ్య కార్యదర్శి జి. సాయి ప్రసాద్ కి ది.29.12.2025 న సామాజిక కార్యకర్త శ్రీనివాస గౌడ్ ఫిర్యాదు చేయటం పాఠకులకు విధేయతమే.

