The Desk … Vuyyuru : గండిగుంటలో 9 అనధికార లే-అవుట్ల కమ్యూనిటీ స్థలాలపై నివేదిక కోరిన పంచాయతీరాజ్ కమిషనర్

The Desk … Vuyyuru : గండిగుంటలో 9 అనధికార లే-అవుట్ల కమ్యూనిటీ స్థలాలపై నివేదిక కోరిన పంచాయతీరాజ్ కమిషనర్

🔴 కృష్ణాజిల్లా : ఉయ్యూరు మండలం : ది డెస్క్ :

ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామంలో 1988-89 నుంచి 9 అనధికార లే-అవుట్లలో కమ్యూనిటీ స్థలాలు, రహదారులు పంచాయతీ స్వాధీనం కాకపోవడంపై రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ వి.ఆర్.కృష్ణతేజ్ మైలవరపు జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, పంచాయతీ అధికారి డా.జె.అరుణలకు విచారణాత్మక నివేదిక కోరారు.

ఎమ్.ఎస్.నం.67 (26.02.2002), ఎమ్.ఎస్.నం.188 (21.07.2011) ప్రకారం ఈ స్థలాలు పంచాయతీకి బదిలీ కావాల్సినా, లే-అవుట్ యాజమానులు స్వాధీనం చేయలేదు. లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి ఉత్తర్వులు ఉన్నప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపణ.

ఉయ్యూరు సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్‌గౌడ్ 22.12.2022 పిర్యాదుపై కమిషనర్ ఓ.ఎస్.డి.కె.ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.ఇటీవల 22.12.2025 పిర్యాదుతో పంచాయతీ కార్యదర్శులు, విస్తరణాధికారులు, డి.ఎల్.పి.వోలు, కలెక్టర్ల పై విచారణకు ఆదేశించాలని కమిషనర్, ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌కు జంపాన విజ్ఞప్తి చేశారు.