🔴 కృష్ణాజిల్లా : ఉయ్యూరు మండలం : ఉయ్యూరు : THE DESK NEWS :
ఉయ్యూరు పట్టణంలోని కాటూరు రోడ్లో సుమారు 16 ఎకరాలలో ఏర్పాటు చేసిన అనధికార లేఔట్ లో రోడ్లు, భవన నిర్మాణాలు చేపడుతున్నారని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస గౌడ్ లోకాయుక్త కు అందించిన ఫిర్యాదు నేపథ్యంలో… శుక్రవారం లోకాయుక్త స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం లేఅవుట్ వద్దకు వచ్చి పరిశీలించింది.

ఉయ్యూరు టౌన్ లో కాటూరు రోడ్డు రిలయన్స్ మార్ట్ పక్కన అనధికార లేఅవుట్ లో మునిసిపాలిటీ అనుమతులు లేకుండా రోడ్లు, బిల్డింగ్ నిర్మాణానికి అనుమతులు, భవన నిర్మాణాలు చేస్తున్నారని జంపాన శ్రీనివాస్ గౌడ్ ద్వారా లోకాయుక్తకు ఫిర్యాదు అందిందని , వచ్చిన ఫిర్యాదు పై విచారణ జరిగిందని జిల్లా కలెక్టర్, మునిసిపల్ కమిషనర్ వద్ద నుండి రిపోర్ట్ తీసుకున్నామన్నారు.
ఫిర్యాదుదారుడు, సంబంధిత శాఖ అధికారులు ఇచ్చిన రిపోర్టులు వాస్తవాలు దూరంగా ఉన్నాయని.. నిజాలు దాచి రిపోర్టులు ఇవ్వడంతో శ్రీనివాస గౌడ్ సంతృప్తి చెందక అభ్యంతరం వ్యక్త పరచడంతో.. లోకాయుక్త ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ టీం తో విచారణ జరపాలని లోకాయుక్త ఇచ్చిన ఆదేశాలపై వచ్చి టీమ్ తో విచారణ చేపడుతున్నామన్నారు.

ఫిర్యాదుదారు, మున్సిపల్ అధికారులతో విచారణ జరిపి వారి వద్ద నుండి డాక్యుమెంట్లను తీసుకుని క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవాలను తెలుసుకుని సమగ్ర రిపోర్టులను లోకాయుక్తకు అందిస్తామని లోకయుక్త ఇన్వెస్టిగేషన్ డిప్యూటీ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి మీడియాకు తెలిపారు.
www.thedesknews.net