The Desk … Vunguturu : ‎AI టెక్నాలజీని విద్యార్దులు అందిపుచ్చుకోవాలి – ఎంపీ పుట్టా మహేష్ కుమార్

The Desk … Vunguturu : ‎AI టెక్నాలజీని విద్యార్దులు అందిపుచ్చుకోవాలి – ఎంపీ పుట్టా మహేష్ కుమార్

🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు నియోజకవర్గం : ది డెస్క్ :

కృత్రిమ మేధ ప్రపంచ భవిష్యత్తును శాసించబోతోంది.. ఎంపీ

ఏఐ నైపుణ్యాలతో విద్యార్దులకు బంగారు భవిష్యత్తు.. ఎంపీ పుట్టా మహేష్ కుమార్

విద్యా, ఉపాధి అవకాశాల్లో ఏలూరు విద్యార్దులు ముందుండాలనే లక్ష్యంతోనే AI పాఠాలు.

నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏఐ ల్యాబ్ ను ప్రారంభించిన ఎంపీ.

ఏఐ నైపుణ్యాలను నేర్చుకుని దేశంలో, రాష్ట్రంలో ఏలూరు విద్యార్దులు అందరికంటే ముందు ఉండాలనే ఉద్దేశంతో  AI లాబ్స్ ఏర్పాటుపై దృష్టి పెట్టామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో AI కంప్యూటర్ ల్యాబ్ ను ఎంపీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ..

ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలోని యువతకు విద్యతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఉపయోగపడే విధంగా కృత్రిమ మేధ నైపుణ్యాలు కల్పించాలనే లక్ష్యంతో AI లాబ్స్ ను ప్రోత్సహిస్తున్నామన్నారు. విద్యార్థి దశలోనే యువతకు ఏఐ నైపుణ్యాలు అందించేందుకు ఏలూరు పార్లమెంట్ పరిధిలో  7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 4 ప్రభుత్వ పాఠశాలలో ఏఐ కంప్యూటర్ ల్యాబులు ఏర్పాటు చేయించే కార్యక్రమం చేపట్టామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విజన్ కు అనుగుణంగా, ఏలూరు పార్లమెంటు పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్ధులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) నైపుణ్యాలు నేర్పించి వారికి ఉన్నతమైన భవిష్యత్తు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తున్నానని చెప్పారు. తాను చదువుకునే సమయంలో కంప్యూటర్ నేర్చుకున్నానని, ఇప్పటి విద్యార్దులు కంప్యూటర్ తో పాటు AI పరిజ్ఞానాన్ని పొందవలసిన అవసరం ఉందన్నారు.

భవిష్యత్తులో జాబ్ స్కిల్స్ లో AI పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాబోవు రోజుల్లో రోబోలు, ఏఐ ద్వారానే అన్ని పనులు చేసే పరిస్థితి రాబోతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత ఐటీ విద్యా మంత్రి నారా లోకేష్ ల పట్టుదలతో అమరావతిలో ఏర్పాటు కాబోతున్న క్వాంటమ్ వ్యాలీతో ఏపీ రూపు రేఖలు మారనున్నాయని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. టెక్నాలజీ, స్టార్టప్, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అమరావతిలో ప్రారంభించబడిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సేవలను ఉపయోగించుకోవాలని ఎంపీ సూచించారు.

టెక్నాలజీ ఉపయోగించుకుని కొత్త  ఆవిష్కరణలు చేసే ప్రతిభ గల విద్యార్దులు ముందుకు వస్తే టాటా ఇన్నోవేషన్ సెంటర్ కి పంపించడం ద్వారా వారి కలలు నెరవేర్చేందుకు కృషి చేస్తానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని విద్యార్దులు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా సరికొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థాయిలకు ఎదగాలని కోరుకుంటున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్  తెలిపారు.

ఈకార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, స్థానిక నేతలు, ORRC స్వచ్ఛంద సంస్థ  ప్రతినిధులు నేహా భండారి, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

Students Must seize the AI technology opportunity – MP Putta Mahesh Kumar.

Artificial intelligence is going to shape the future of the world – MP

A golden future for students with AI skills – MP Putta Mahesh Kumar

AI lessons are aimed at ensuring Eluru students are at the forefront in education and employment opportunities.

The MP inaugurated the AI ​​lab at Narayanapuram Government Junior College.

MP Putta Mahesh Kumar revealed that they are focusing on setting up AI labs with the intention of ensuring that Eluru students are ahead of everyone else in the country and the state by learning AI skills. On Friday, the MP inaugurated the AI ​​computer lab at Narayanapuram Government Junior College in Unguturu constituency. Speaking on this occasion, MP Putta Mahesh Kumar said that they are promoting AI labs with the aim of providing artificial intelligence skills to the youth of Eluru parliamentary constituency, which will be useful for their education and employment opportunities. MP Putta Mahesh Kumar clarified that they have undertaken a program to set up AI computer labs in 7 government degree colleges and 4 government schools within the Eluru parliamentary constituency to provide AI skills to the youth at the student level. MP Putta Mahesh Kumar stated that, in line with the vision of Chief Minister Chandrababu Naidu and IT and Education Minister Nara Lokesh, he is making every effort to provide a bright future for students studying in government degree colleges and schools within the Eluru parliamentary constituency by imparting Artificial Intelligence (AI) skills. He mentioned that he learned computer skills during his student days and emphasized the need for today’s students to acquire AI knowledge along with computer skills. He said that AI knowledge will be very useful in future job skills. He added that in the coming days, a situation will arise where all tasks will be performed through robots and AI. MP Putta Mahesh Kumar stated that the Quantum Valley being established in Amaravati, thanks to the determination of Chief Minister Chandrababu and young leader and IT and Education Minister Nara Lokesh, will transform the face of Andhra Pradesh. The MP suggested that students utilize the services of the Ratan Tata Innovation Hub, which has been launched in Amaravati to encourage technology, startups, and innovations. MP Putta Mahesh Kumar assured that if talented students who can utilize technology to create new innovations come forward, he will work towards fulfilling their dreams by sending them to the Tata Innovation Center. MP Putta Mahesh Kumar expressed his hope that students will utilize this opportunity to acquire new skills in line with changing technology and rise to greater heights. Unguturu MLA Patsamatla Dharmaraju, APCOB Chairman Ganni Veeranjaneyulu, local leaders, ORRC NGO representatives Neha Bhandari, and college staff participated in this program.