- వెల్ఫేర్ అసిస్టెంట్ , మహిళా పోలీసులకు అవగాహన సదస్సు
ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : ఉంగుటూరు : ది డెస్క్ :
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 15వ తేదీన ప్రారంభమైన సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని పారదర్శకంగా పక్కాగా నిర్వహించాలని ఉంగుటూరు ఎంపీడీవో జి ఆర్ మనోజ్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ , మహిళా పోలీసులకు సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
ఈ సమగ్ర సర్వే కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది అందరూ వారికి కేటాయించిన క్లస్టర్లలో సర్వే నిర్వహించాలని స్థానిక నాయకులు, ప్రజలు, సచివాలయ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. ఈ సర్వే ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా ప్రభుత్వం మరికొన్ని కొత్త పథకాలని రూపొందించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి సర్వేను కచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా వివరాలు సేకరించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు.
కార్యక్రమంలో మహిళా పోలీసులు, సచివాలయ సిబ్బంది, వెల్ఫేర్ అసిస్టెంట్లు, డిప్యూటీ ఎంపీడీవో ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
Unguturu MPDO Stresses Transparent Execution of Family Survey.
Eluru district’s comprehensive family survey must be carried out in a transparent and foolproof manner, said Unguturu Mandal Parishad Development Officer (MPDO) G.R. Manoj. Addressing an awareness session for welfare assistants and women police at the Unguturu Mandal Parishad office on Wednesday evening, he called for effective coordination to ensure the survey’s success.
Mr. Manoj said all village and ward secretariat staff should cover their allotted clusters without fail and urged local leaders and the public to cooperate fully. Data from this survey would help the government design new welfare schemes, he noted, advising staff to record details accurately and honestly.
Women police, welfare assistants, secretariat staff and Deputy MPDO Muthayya participated in the programme

