The Desk…Vunguturu : ఉపాధి హామీ పనులపై బహిరంగ విచారణ

The Desk…Vunguturu : ఉపాధి హామీ పనులపై బహిరంగ విచారణ

🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : కాకర్లమూడి :

కాకర్లమూడి గ్రామంలో ఉపాధి పనులపై బహిరంగ విచారణ నిర్వహించిన ఉంగుటూరు ఎంపీడీవో జి ఆర్ మనోజ్. ఇటీవల కాకర్లమూడికి సంబంధించి ఉపాధి హామీ పథకం పనులలో తేడాలు ఉన్నాయని సోషల్ ఆడిట్లో అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో ఉంగుటూరు ఎంపీడీవో మరియు ఉపాధి హామీ పథకం ప్రోగ్రామింగ్ అధికారి అయిన జి ఆర్ మనోజ్ కాకర్లమూడి గ్రామపంచాయతీలో బహిరంగ విచారణ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం శ్రామికులు, మేట్లు స్థానిక నాయకులు పాల్గొన్నారు. సదరు విచారణలో కాకర్లమూడి పంచాయతీ పరిధిలోని అయ్యప్ప కోడ్ అనే పంట కాలువలో ఎనిమిది వందల మీటర్ల అంచనాలుగాను 638 మీటర్లు పని చేసినట్లు దానికి సంబంధించిన వేతనాలు తమ తమ అకౌంట్లు పడినట్లు ఉపాధి హామీ పథకం శ్రామికులు రాతపూర్వకంగా తెలియజేశారు.

అయితే అప్పటి సోషల్ ఆడిట్ డిఆర్పి అవగాహన లోపంతో 330 మీటర్ల రికార్డ్ చేయడం జరిగిందని దాని గురించి అప్పటి గ్రామసభలోనే అభ్యంతరం తెలియజేయడం జరిగిందని కానీ ఆ డిఆర్పి 330 మీ సోషల్ ఆడిట్ వారికి సమర్పించడం జరిగిందని అందువలనే ఆ పనుల మీద అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగిందని ఉపాధి హామీ శ్రామికులు ఎంపీడీవోకి తెలియజేశారు.

కార్యక్రమంలో ఎంపీడీవోతో పాటు టెక్నికల్ అసిస్టెంట్ ప్రసన్న స్థానిక సర్పంచ్ నౌడు వెంకట్రావు, ఉపాధి హామీ సేవకులు, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.