🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : ది డెస్క్ :
మంగళవారం ఉదయం ఉంగుటూరు మండలం బొమ్మిడి జిల్లా పరిషత్ హైస్కూల్ ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి 10వ తరగతి విద్యార్థులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా రాజ్ మనోజ్ మాట్లాడుతూ..
ప్రతి విద్యార్థి దశలో పదవ తరగతి అత్యంత కీలకమైనదని విద్యార్థులు ప్రభుత్వం నిర్దేశించిన వందరోజుల కార్యచరణ ప్రణాళికా బద్దంగా సిద్ధం కావాలని పిల్లలకు సూచించారు.100% ఉత్తీర్తత సాధించే విధంగా 10వ తరగతి విద్యార్థులను తీర్చిదిద్దాలని అదేవిధంగా రివిజన్ తరగతులు రెగ్యులర్ గా నిర్వహించాలని ఉపాధ్యాయులకు ఎంపీడీవో సూచించారు.మరియు ఇష్టపూర్వకంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలని సూచించారు. అనంతరం మధ్యాహ్నం భోజనం సిద్ధం చేసే వంటశాలను పరిశీలించి భోజనం రుచితో పాటు పాత్రలు పరిశుభ్రంగా ఉండే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వంట చేసే కార్మికులతో ఆయన తెలియజేశారు.
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, సంబంధిత సబ్జెక్టు టీచర్లు, బొమ్మిడి పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
Unguturu MPDO stresses 100-days plan for SSC success
Unguturu Mandal MPDO Raj Manoj on Tuesday conducted a surprise inspection of the Zilla Parishad High School at Bommidi and interacted with Class 10 students as part of the 100-day action plan for SSC exam preparedness.
Speaking on the occasion, he said Class 10 is a decisive phase in every student’s life and urged them to strictly follow the government’s 100-day schedule to achieve 100% pass results. He instructed teachers to conduct regular revision classes and motivate students to set clear academic goals.
Later, he inspected the mid-day meal kitchen, checked food quality and hygiene, and advised cooks to maintain cleanliness. The headmaster, subject teachers and Bommidi panchayat secretary participated in the programme.

