The Desk…Vunguturu : దివ్యాంగులలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి ➖ఎంపీడీవో జీ ఆర్ మనోజ్

The Desk…Vunguturu : దివ్యాంగులలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి ➖ఎంపీడీవో జీ ఆర్ మనోజ్

🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : ది డెస్క్ :

ఉంగుటూరు మండలం జిల్లా పరిషత్తు హైస్కూల్ ప్రాంగణం నందు ఉన్న భవిత పాఠశాలలో జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా.. ఉంగుటూరు ఎంపీడీవో జి ఆర్ మనోజ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ..

వికలాంగుల్లో కూడా అంతర్గతంగా ఏదో ఒక అంశంలో ప్రతిభ దాగి ఉంటుందని దాన్ని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. అదేవిధంగా వారికి ప్రభుత్వం కల్పించవలసిన అన్ని వసతులను కల్పించడానికి కృషి చేయాలని సూచించారు. మండలంలో వికలాంగులకు సంబంధించి 1803 పెన్షన్లను, వారి ఇంటి వద్దకే వెళ్లి ఉదయమే అందించడం జరుగుతుందని ఆయన అన్నారు. తదనంతరం వికలాంగుల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి డిప్యూటీ డిఇఓ రవీంద్ర భారతి ఉంగుటూరు గ్రామ సర్పంచ్ లక్ష్మి, జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు, స్థానిక పెద్దలు వికలాంగుల సొసైటీ సభ్యులు దుర్గారావు, దివ్యాంగులైన పిల్లల యొక్క తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.