🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు నియోజకవర్గం : గొల్లగూడెం : ది డెస్క్ :
- ఉపాధ్యాయుడిగా మారిన ఎంపీడీవో – రాజ్ మనోజ్.

ఉంగుటూరు ఎంపీడీవో రాజ్ మనోజ్ గొల్లగూడెం గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ను సందర్శించి, పదవ తరగతి విద్యార్థులతో కాసేపు సంభాషించారు మరియు పబ్లిక్ పరీక్షల ప్రిపరేషన్ గురించి అడిగి వివరాలు తెలుసుకొని, విద్యార్థులకు క్లాస్ రూమ్ లో పిల్లలకు చదువు పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు.
అదేవిధంగా మధ్యాహ్న భోజనాన్ని కూడా పరిశీలించి, వండిన ఆహారం పులిహార రుచి చూశారు. ఈ సందర్భంగా పులిహార చాలా బాగుందని సిద్ద పరిచిన సిబ్బందిని ఎంపీడీవో రాజ్ మనోజ్ అభినందించారు.

