The Desk … Vunguturu : స్వచ్ఛ రథంను ప్రారంభించిన ఎమ్మెల్యే ధర్మరాజు

The Desk … Vunguturu : స్వచ్ఛ రథంను ప్రారంభించిన ఎమ్మెల్యే ధర్మరాజు

🔴 ఏలూరు జిల్లా : ది డెస్క్ :ఉంగుటూరు :

ఉంగుటూరులో స్వచ్ఛ రథంను ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…

గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలి అన్న భావనతో కూటమి ప్రభుత్వం పారిశుద్ధ్యనికి అత్యంత ప్రాధాన్యమిస్తుందని అందులో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం కింద పారిశుద్వానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని అందులో భాగంగానే మండలంలోని అన్ని గ్రామపంచాయతీలో పొడి చెత్తను సేకరించే నిమిత్తం స్వచ్ఛరథమని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

ఈ స్వచ్ఛ రథం నెలలో 25 రోజులు పని చేస్తూ రోజుకు ఒక గ్రామం చొప్పున పర్యటిస్తూ.. ఆ గ్రామంలోని ప్లాస్టిక్ అట్టపెట్టెలు పేపర్లు తదితర పొడి చెత్తను సేకరించి వాటికి విలువ కట్టి వాటికి బదులుగా నిత్యవసర వస్తువులను తిరిగి ఇవ్వడం జరుగుతుందని దీనివలన పొడి చెత్తకు విలువ ఏర్పడి గ్రామస్తులుకు కూడా ఉపయోగపడుతుందని గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయని కాబట్టి ప్రజలు ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తూ ప్రోత్సహించాలని స్థానిక కూటమి నాయకులు కూడా ఈ స్వచ్ఛ రధాన్ని ఉపయోగించుకొనే విధంగా ప్రజల్లో విస్తృత ప్రచారాన్ని చేయాలని ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఏఎంసీ చైర్మన్ అయ్యప్ప జ్యోతి ఎంపీడీవో జి ఆర్ మనోజ్,డిప్యూటీ ఎంపీడీవో రమేష్ పారిశుద్ధ కార్మికులు స్థానిక సర్పంచ్ అలకనంద పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.