🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు నియోజకవర్గం : ది డెస్క్ :
ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు 3.06కోట్లు విలువ చేసే అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. సోమవారం ఉదయం ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఉంగుటూరు మండలంలో నాచుకుంటలో 40 లక్షలతో నిర్మించిన సిమెంటు రోడ్డుకు ప్రారంభం చేశారు. అనంతరం నారాయణపురం గ్రామపంచాయతీలు సి బ్లాక్ నందు, ఎన్టీఆర్ కాలనీ నందు కోటి పది లక్షలతో రెండు సిమెంట్ రోడ్లను ఆయన ప్రారంభోత్సవం చేశారు.
అనంతరం నారాయణపురంలోని జాన్సన్ టైల్స్ ఫ్యాక్టరీ వెళ్లే రోడ్డుకు శంకుస్థాపన చేశారు. దీని విలువ కోటి 56 లక్షలు ఎమ్మెల్యే పాటు, ఎంపీడీఓ జి. ఆర్. మనోజ్, డీ. ఈ. వేణుగోపాల్,స్థానిక కూటమి నాయకులు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు అనంతరం నారాయణపురం పంచాయతీ పరిధిలో శనివారం ఆదివారం జరిగిన ముగ్గుల పోటీలలో విజేతలకు శాసనసభ్యులు బహుమతులు ప్రధానం చేశారు విజేతలకు అభినందనలు తెలియజేశారు.

