The Desk … Vunguturu : పారిశుద్ధ్య పరిరక్షణకు మండలానికో పారిశుద్ధ్య రథం : జడ్పీ సీఈవో శ్రీహరి

The Desk … Vunguturu : పారిశుద్ధ్య పరిరక్షణకు మండలానికో పారిశుద్ధ్య రథం : జడ్పీ సీఈవో శ్రీహరి

ఈనెల 17న మొదటి విడతగా మండలాలకు అందుబాటులోకి పారిశుద్ధ్య రథాలు

🔴 ఏలూరు జిల్లా :ఉంగుటూరు : ది డెస్క్ :

పారిశుద్ధ్య పరిరక్షణలో భాగంగా జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి శుక్రవారం ఉంగుటూరు మండలంలోని తల్లాపురం, అప్పారావుపేట, గ్రామాలను పారిశుద్ధ్య పరిస్థితులు పై ఆకస్మిక తనిఖీ చేశారు. డోర్ టు డోర్ కి వెళ్లి పారిశుధ్య పరిస్థితులపై ఆరా తీశారు.ప్రజల నుంచి సమాధానాలను స్వీకరించారు.
గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు, సరిగ్గా వస్తున్నారా లేదా అని ప్రజలను అడగగా..కొంతమంది ప్రజలు వస్తున్నారని మరి కొంతమంది సరిగ్గా రావట్లేదని సీఈఓ కి వివరణ ఇచ్చారు.

జిల్లా పరిషత్ సి.ఈ.ఓ శ్రీహరి మాట్లాడుతూ..

పారిశుద్ధ్యం పట్ల నిర్లక్ష్యం, అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవని,15వ ఆర్థిక సంఘం నిధులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని నియోగించి పారిశుద్ధ్యం పరిరక్షించడానికి ప్రజలు మెప్పు పొందే విధంగా పనిచేయాలని అధికారులకు, కార్మికులకు సూచించారు. పారిశుద్ధ్య కార్మికులు మానేస్తే వెంటనే ప్రత్యన్మాయంగా ఏర్పాట్లు చేసుకోవాలని..పారిశుద్ధ్య వాహనాలు ఎప్పటికప్పుడు కండిషన్లో పెట్టుకోవాలని, పారిశుద్ధ్యం మరింత మెరుగుపరచడానికి తగిన చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.

త్వరలో పారిశుద్ధ్య రథాలు :

ఈనెల 17వ తేదీన మండలానీకో పారిశుద్ధ్య రథం అందుబాటులోకి మూడు దశలుగా ఈ పారిశుద్ధ్య రధాలు వస్తాయని,పొడి – చెత్త సేకరణకు అనగా ప్లాస్టిక్ ,అట్టలు, పుస్తకాలు, పాడైపోయిన వస్తువులు మొదలగునవి పొడి చెత్త రూపంలో ఈ పారిశుద్ధ్య రథల ద్వారా సేకరణ జరుగుతుందని.. దానికి బదులుగా నిత్యవసర వస్తువులు గృహాల్లో ఉపయోగపడే కందిపప్పు, సబ్బులు, పేస్టులు మొదలైనవి ఇస్తారన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం మరింత మెరుగుపరచడానికి పారిశుద్ధ్య పరిరక్షణకు ప్రభుత్వం నిధులతో ప్రైవేట్ వ్యక్తులను భాగస్వాములుగా చేసి ప్రజల సౌకర్యార్థం క్షేత్రస్థాయిలో పర్యటించనున్నాయని సీఈఓ శ్రీహరి అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జి రాజ్ మనోజ్, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.