🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : ఉంగుటూరు : ది డెస్క్ :
గ్రామాల్లో గృహాల నుండి వచ్చే చెత్తను తడిచెత్త – పొడిచెత్త కింద వేరుచేసి పారిశుధ్య కార్మికులకు అందించాలని తద్వారా వీధులను గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం సాధ్యమవుతుందని ఎంపీడీవో తెలియజేశారు. గురువారం ఉదయం ఉంగుటూరు గ్రామపంచాయతీ పరిధిలోని కొన్ని వీధులలో పర్యటించి ఆ ప్రాంతంలోని మహిళలకు పొడిచెత్త – తడిచెత్త ఏ విధంగా వేరు చేసి ఇవ్వాలో పారిశుధ్య కార్మికుల చేత అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో మనోజ్ మాట్లాడుతూ..
డ్రైన్ లలో చెత్త వేసే అలవాట్లు మానుకోవాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి పంచాయతీ వారికి సహకరించాలని, డోర్ టు డోర్ చెత్త సేకరణకి పారిశుధ్య కార్మికులు వచ్చే సమయానికి చెత్తను తడిచెత్త – పొడిచెత్త వేరుచేసి ఇవ్వాలని వారికి తెలియజేశారు. అనంతరం పలు వీధుల్లో పర్యటించి డ్రైనేజీ సమస్యల్ని త్వరలో పరిష్కరించడం జరుగుతుందని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా డిపిఆర్సి మేనేజర్ ప్రసంగి రాజు, సూర్య కుమార్ ఉంగుటూరు పంచాయతీ కార్యదర్శి బొడ్డు రవిచంద్ర, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.

