🔴 విశాఖ జిల్లా : విశాఖ : THE DESK NEWS :
విశాఖ సభలో ప్రధాని మోదీఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని నరేంద్ర మోడీ భారీ కానుక ఇచ్చారు. విశాఖలో రూ.2.85 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధానితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ప్రధాని మోదీ తన ప్రసంగంలో, దేశ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య పాత్ర పోషించడమే కాదు, ఇక్కడి ప్రజలు కొత్త అభివృద్ధికి సిద్ధంగా ఉన్నారన్నారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం విశాఖపట్నంలో ఏపీ చరిత్రలోనే నిలిచిపోయే రూ. 2 లక్షల కోట్లకు పైగా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవస్థ, కనెక్టివిటీని పెంచడంలో ఈ ప్రాజెక్టులు ఎంతో ఉపయోగపడతాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
విశాఖపట్నంలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ…
60 ఏళ్ల విరామం తర్వాత దేశంలో మూడోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదే తన తొలి అధికారిక కార్యక్రమమన్నారు. ఆంధ్ర ప్రజలు ఇచ్చిన అద్భుతమైన స్వాగతం, ఈ రోజు ప్రజలు నన్ను స్వాగతించిన తీరు అమితంగా ఆకట్టుకుందన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి ప్రతి మాటను గౌరవిస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను భరోసా ఇస్తున్నానని, కలిసికట్టుగా చంద్రబాబు లక్ష్యాలను కచ్చితంగా సాధిస్తామని ప్రదాని మోదీ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అవకాశాలకు, అవకాశాలకు కొదవలేదు. దేశాభివృద్ధిలో ఈ రాష్ట్రం కీలకపాత్ర పోషించడమే కాకుండా కొత్త అభివృద్ధికి ఇక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రశంసిస్తూ, ‘చంద్రబాబు చెప్పినది దేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు స్ఫూర్తిదాయకం.
ఆయన ప్రతి మాటలో అభివృద్ధి, సంకల్ప స్ఫూర్తి ప్రతిఫలిస్తుంది. ఆయన చెప్పిన అన్ని ఆలోచనలను అందరం కలిసి నెరవేరుస్తామని” ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. అభివృద్ధి దిశగా కలిసి ముందుకు సాగుదామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భవిష్యత్‌లో నూతన సాంకేతికతలకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మారాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మా విజన్ అని అన్నారు ప్రధాని. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయడమే మా సంకల్పమన్నారు. ఆంధ్రప్రదేశ్ 2047 నాటికి దాదాపు 2.5 ట్రిలియన్ డాలర్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ దృక్పథాన్ని సాకారం చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2047లో బంగారు ఆంధ్రకు శ్రీకారం చుట్టింది. ఇందులో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతి లక్ష్యంతో భుజం భుజం కలిపి పని చేస్తోంది. అందుకే కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల పథకాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.కొత్త ప్రారంభించే ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త పుంతలు తొక్కుతాయన్నారు ప్రధాని మోదీ. ఆంధ్ర ప్రదేశ్ ఇన్నోవేషన్ స్వభావం కారణంగా ఐటి, టెక్నాలజీకి కేంద్రంగా ఉంది.
కొత్త, భవిష్యత్తు సాంకేతికతలకు ఆంధ్రా కేంద్రంగా మారాల్సిన సమయం ఆసన్నమైంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం కంటే మనం ముందంజలో ఉందామన్నారు. గ్రీన్ హైడ్రోజన్ అభివృద్ధి చెందుతున్న క్షేత్రం అని ఆయన అన్నారు. దేశం 2023లో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ను ప్రారంభించింది. 2030 నాటికి ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడమే లక్ష్యం. ఇందుకోసం తొలిదశలో రెండు గ్రీన్ హైడ్రోజన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తానమన్నారు ప్రధాని. అందులో మన విశాఖపట్నం ఒకటి.
భవిష్యత్తులో ఇంత పెద్దఎత్తున గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే సదుపాయం ఉన్న ప్రపంచంలోని అతికొద్ది నగరాల్లో విశాఖపట్నం నిలుస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ గ్రీన్ హైడ్రోజన్ కేంద్రం అనేక ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది మరియు ఆంధ్రప్రదేశ్‌లో తయారీ పర్యావరణ వ్యవస్థను కూడా సృష్టిస్తుందని మోదీ స్పష్టం చేశారు.అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి నేతలపై పూలవర్షం కురిపించారు. ప్రధాని మోదీ కూడా వారికి కరచాలనం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. మార్గమంతా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల జెండాలతో నిండిపోయింది. సిరిపురం కూడలి వినాయకుడి ఆలయం నుంచి ప్రారంభమైన రోడ్ షో ఆంధ్రా యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కళాశాల మైదానానికి చేరుకుంది. ఇక్కడ ప్రధాని మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం:
రూ.1518 కోట్లతో 2500 ఎకరాల స్థలంలో నిర్మించిన కృష్ణపట్నం ఇండస్ట్రియల్ హబ్‌ను ప్రధాని ప్రారంభించారు. దీంతో 50 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.నక్కపల్లిలో రూ.1,877 కోట్లతో బల్క్ డ్రగ్ పార్కుకు శంకుస్థాపన చేశారు. 2002 ఎకరాల స్థలంలో రూ.1,1542 కోట్లతో దీన్ని నిర్మించనున్నారు. దీని వల్ల 54 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా.
తిరుపతి జిల్లాలో చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్ కింద గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని నిర్మించనున్నారు. దీనివల్ల రాష్ట్రంలో రూ.1,0500 కోట్ల పెట్టుబడులు వస్తాయని, లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా.రూ.19,500 కోట్ల వ్యయంతో రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు కూడా ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.గుంటూరు, బీబీనగర్, గూటి, పెండేకల్లు మధ్య రైల్వే డబ్లింగ్ పనులకు శంకుస్థాపన చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..!
గత ఐదేళ్లూ విధ్వంసానికి గురై, వెంటిలేటర్ పైకి చేరిన ఏపీని పునర్‌నిర్మించేందుకు కేంద్ర సహకారంతో ఒక్కో ఇటుక పేరుస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే ఎన్డీయే ప్రభుత్వ విధానమని.. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనే తమ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా, ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల్లోనే రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.
విశాఖపట్నంలో బుధవారం సాయంత్రం జరిగిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘మోదీ దారిలోనే మేమూ నదుల అనుసంధానాన్ని చేపడుతున్నాం. ఆయన ఆశీస్సులతో పూర్తి చేస్తాం’ అని అన్నారు. వెనుకబడిన ప్రాంతమైన రామాయపట్నంలో రూ.70 వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు సహకరించిన మోదీకి.. రాష్ట్ర ప్రజల తరఫున చంద్రబాబు కృతజ్ఞతలు చెప్పారు. ‘రోడ్‌షో అదిరింది.. ప్రజలకు ఆయనపై ఉన్న నమ్మకం, విశ్వాసమే దీనికి కారణం’ అని పేర్కొన్నారు.
సరైన సమయంలో సరైన ప్రధానిగా మోదీ ఉండటమే దేశానికి అతిగొప్ప ప్రయోజనం కలిగించే అంశమని.. ఉన్న విషయమే చెబుతున్నా తప్ప, తానేమీ ఆయన్ను పొగడటం లేదని చంద్రబాబు చెప్పారు. ‘భారత్ బ్రాండ్ ఎంతో బలంగా ఉంది. అందుకు మోదీ కారణమని దేశంలోని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రపంచంలోని నేతలందరి కంటే మోదీ ఎంతో ఎత్తున నిలిచారు. ఆయన భారతనేత మాత్రమే కాదు. ప్రపంచనేత’ అని కొనియాడారు. ‘మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. ఇది తథ్యం’ అని విశ్వాసం వెలిబుచ్చారు.
కేంద్రం చేయూతతో ఏపీ పునర్నిర్మాణం
వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమంలో ప్రధాని మోదీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లతో ఎంపీలు సీఎం రమేశ్, పురందేశ్వరి, రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, సత్యకుమార్, కేంద్ర మంత్రులు భూపతిరాజు శ్రీనివాసవర్మ, రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత, టీజీ భరత్‌మోదీ నిర్ణయాలే స్ఫూర్తి ‘దేశ అభివృద్ధి కోసం నిరంతరం మోదీ తీసుకునే నిర్ణయాలు నాకు స్ఫూర్తినిస్తున్నాయి.. నేను ఆయన నుంచి పాఠాలు నేర్చుకుంటున్నా. మోదీ నాయకత్వంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. మోదీ ప్రగతిశీల ప్రధానమంత్రి. రేపు జరిగే పని నిన్న చేసి ఉంటే బాగుంటుందని ఆలోచించే ప్రధాని ఈ దేశానికి ఉండటం మనందరి అదృష్టం’ అని చంద్రబాబు ప్రశంసలు కురిపించారు.
‘స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టేందుకు ఆర్సెలార్ మిత్తల్ ముందుకొచ్చినా.. కొన్ని అవరోధాలు ఎదురయ్యాయి. దీనిపై నేను ప్రధాని మోదీని కలిసి వివరించా. ఇనుప ఖనిజాన్ని స్లర్రీ రూపంలో పైప్‌లైన్ ద్వారా తెచ్చుకునేందుకు అనుమతి కోరుతున్నారని.. అది పర్యావరణ అనుకూలమని, రవాణా వ్యయమూ తగ్గుతుందని చెబితే మోదీ ఏకీభవించారు. ఎంతమంది ప్రధానమంత్రులకు ఇది అర్థమవుతుంది? విశాఖపట్నంలో పెట్టుబడులకు గూగుల్ ఒక ప్రతిపాదనతో వచ్చింది. భారత్ వచ్చేందుకు తాము సుముఖంగా ఉన్నామని, అయితే ప్రభుత్వం భవిష్యత్తులో పన్ను విధానంలో మార్పులు తెస్తే ఎలాగనే సందేహం వెలిబుచ్చారు.
మోదీని కలిసి ఈ విషయాన్ని వివరించా. పన్ను విధానంలో మార్పు ఉండదని, అలాంటి నిర్ణయాలు తీసుకుంటే భారత్‌కు ఎవరూ రారని, ఈ విషయంలో నేను మీతోనే ఉంటానని మోదీ సమాధానమిచ్చారు. అందరూ కోరుకునేది ఇలాంటి నిర్ణయాలే. అప్పుడే పెద్దఎత్తున పెట్టుబడులు వస్తాయి’ అని చంద్రబాబు అన్నారు.దిల్లీలోనూ ఎన్డీయే ప్రభుత్వమే ‘మోదీ, పవన్ కల్యాణ్, నేను కలిసి ఆంధ్రప్రదేశ్‌లో 57% ఓట్లతో బ్రహ్మాండమైన విజయం సాధించాం.
భవిష్యత్తులోనూ మా కాంబినేషన్ కొనసాగుతుంది. మోదీ ప్రధానిగా ఉంటారు. హరియాణా, మహారాష్ట్రల్లోనూ తిరుగులేని మెజారిటీతో ఎన్డీయే గెలవడానికి కారణం మోదీ చరిష్మాయే. రాసిపెట్టుకోండి.. త్వరలో దిల్లీలో జరిగే ఎన్నికల్లోనూ ఎన్డీయే అధికారంలోకి వస్తుంది. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో మొదటి, రెండు స్థానాల్లో నిలుస్తుంది. ఇది మోదీతోనే సాధ్యం’ అని స్పష్టం చేశారు. ‘కేంద్రం అండతోనే పింఛన్లు ఇస్తున్నాం. అన్న క్యాంటీన్లు పెట్టాం.
దీపం-2 కింద వంటగ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. సూపర్ సిక్స్ కార్యక్రమాలను పూర్తి చేసే బాధ్యత ఎన్డీయే ప్రభుత్వం తీసుకుంటుంది’ అని చంద్రబాబు చెప్పారు. ‘రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా నిలుస్తుంది. ఐటీ, ఫార్మా, టూరిజం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుంది’ అని అన్నారు. ప్రపంచంలోనే ఫేమస్ బ్రాండ్‌గా అరకు కాఫీ తయారైందంటే మోదీ చూపిన చొరవే కారణమని ప్రశంసించారు.
నారా లోకేష్ ఏమన్నారంటే..!
భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ పనిచేస్తున్నారని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఆయన తీసుకొచ్చిన ‘వికసిత్ భారత్’ స్ఫూర్తితో రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ‘స్వర్ణాంధ్ర-2047’ డాక్యుమెంట్‌ను విడుదల చేశారన్నారు.
వ్యవసాయం, విద్య, పరిశ్రమలు, పునరుత్పాదక విద్యుత్తు, క్రీడలు, పోర్టులు ఇలా అన్ని రంగాల్లో లక్ష్యాలు పెట్టుకుని పనిచేయడమే స్వర్ణాంధ్ర లక్ష్యమన్నారు. ‘హర్ ఘర్ తిరంగా.. హర్ భారతీయ్ కే దిల్ మే నమో.. పేదల చిరునవ్వు.. మహిళల ఆత్మగౌరవం.. యువత భవిత.. అన్నదాతల కళ్లలో ఆనందం నమో’ అంటూ కొనియాడారు. ‘2014 నాటికి ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థికవ్యవస్థను ప్రస్తుతం ఐదోస్థానానికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వ అసమర్థ పాలనతో రాష్ట్ర ఆర్థికవ్యవస్థ వెంటిలేటర్ పైకి వెళ్లిపోయింది.
ప్రతి నెలా రూ.4 వేల కోట్ల లోటుతో ప్రభుత్వం నడుస్తోంది. ఇలాంటి రాష్ట్రానికి మోదీ ఆక్సిజన్ అందించారు. అమరావతి, పోలవరం, ఇతర ప్రాజెక్టులకు నిధులిచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు వేగవంతమయ్యాయి. గత ప్రభుత్వంలో రూ.1,000 పింఛను పెంచడానికి ఐదేళ్లు పడితే.. చంద్రబాబు ఒకే సంతకంతో రూ.1,000 పెంచారు. త్వరలో మెగా డీఎస్సీ విడుదల చేయనున్నారు. రాష్ట్ర దశ, దిశ మార్చే ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు.
ఉత్తరాంధ్ర ప్రజల కోరికైన రైల్వేజోన్‌కు గత ప్రభుత్వం భూమి కూడా ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైల్వేజోన్ పట్టాలెక్కింది. మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంతో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. 2014-19 మధ్య రాష్ట్రం అభివృద్ధి చెందిన తీరు, 2019-24లో వైకాపా పాలనలో జరిగిన విధ్వంసం ప్రజలంతా చూశారు. ఎన్డీయే ప్రభుత్వం కొనసాగితే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోయేది’ అని లోకేశ్ వివరించారు.
పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..!
రాష్ట్ర ప్రజలు కూటమిని నమ్మి.. పట్టం కట్టారు. అందువల్లే ఇప్పుడు రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ప్రధాని మోదీ, సమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే ఇది సాధ్యమయింది. మా మంత్రులం, కూటమి ఎమ్మెల్యేలం రేయింబవళ్లూ కష్టపడతాం.
దేశ ప్రగతిలో భాగస్వాములవుతాం. ప్రధానికి అండగా నిలుస్తాం. మేం నేర్చుకుంటున్నాం, కష్టపడుతున్నాం’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ సభలో ఆయన మాట్లాడారు. ‘ఎన్డీయే కూటమిపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో వెలుగులు నింపుతున్నారు. ఈ పెట్టుబడుల వల్ల రాష్ట్రంలో 7.50 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది.
దక్షిణ కోస్తా రైల్వేజోన్, కృష్ణపట్నం పారిశ్రామిక పార్కు, గ్రీన్ హైడ్రో హబ్, బల్క్ డ్రగ్ పార్కు, రోడ్ల నిర్మాణం, విస్తరణ ప్రాజెక్టులు, ఆరు రైల్వే ప్రాజెక్టులు.. ఇవన్నీ అందులో భాగమే. దేశంలోని ఏ ఒక్కరూ అభివృద్ధిలో వెనుకబడకూడదు. అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు.. ఏపీలోని ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర కావచ్చు. అందరికీ సమాన వాటా ఉండాలనే ఇన్ని పెట్టుబడులు.
ఇలా సహకరిస్తున్నందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు’ అని పవన్ కల్యాణ్ అన్నారు. ‘ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద మారుమూల ప్రాంతాల రోడ్ల నిర్మాణానికి నిధులిస్తున్నారు. జల్‌జీవన్ మిషన్ కింద 24 గంటలు స్వచ్ఛమైన నీరందించేందుకు నిధులు అందజేస్తున్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు నిధులందించారు’ అని గుర్తు చేశారు.
బలమైన భారత్ కోసమే
‘సదుద్దేశం, సదాశయం లేకుండా ఒకరు (పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి) కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచినా అదొక నిరర్థక నడకగా చరిత్రలో మిగిలిపోతుంది. సదాశయంతో, సత్సంకల్పంతో మరొకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజలందరితో మమేకమై వారందరినీ ఏకతాటిపై నడిపిస్తే అది ఆత్మనిర్భర్ భారత్ అవుతుంది.
పరిసరాల శుభ్రత బాధ్యత తెలియజేస్తే.. స్వచ్ఛభారత్ అవుతుంది. ప్రజల గుండెల్లో దేశభక్తి, ధైర్య సాహసాలు నింపితే.. పటిష్ఠమైన భారత్ అవుతుంది. ఒక రోజు అది అఖండ భారత్ అవుతుంది. బలమైన భారత్ కోసం, దృఢమైన దేశం కోసం.. జగత్ అంతా వసుధైక కుటుంబం అన్న భావన కోసం మోదీ నాలుగున్నర దశాబ్దాలుగా పరిశ్రమిస్తూ, పరితపిస్తున్నారు.
ఆ దారిలో ఎదుర్కొన్న ప్రతి పరాజయాన్ని, ప్రతి అవమానాన్ని నవ్వుతూ స్వీకరిస్తూ వాటినే విజయాలకు ఇంధనంగా వాడుకుంటూ, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రపంచంలోనే మూడో బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని పవన్ కల్యాణ్ ప్రస్తుతించారు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు రాజకీయ ఉద్ధండులు, అనుభవజ్ఞులు, దార్శనికులని ఆయన కొనియాడారు.