The Desk…Vinnakota : కన్నుల పండువగా రామాలయ పునః ప్రతిష్ట

The Desk…Vinnakota : కన్నుల పండువగా రామాలయ పునః ప్రతిష్ట

కృష్ణా జిల్లా : గుడ్లవల్లేరు మండలం : విన్నకోట : THE DESK NEWS :

మండలంలోని విన్నకోట శివారు సుబ్బిచెరువు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రామాలయం పునః ప్రతిష్ట గురువారం ఎంతో వైభవగా నిర్వహించారు.

ముదినేపల్లికి చెందిన ప్రముఖ ప్రయివేటు వైద్యుడు డాక్టర్ అంబుల మనోజ్ కుటుంబ సభ్యులు భక్తి శ్రద్దలతో ఆలయ అర్చకులు, వేద పండితుల వేద మంత్రాలతో.. శ్రీసీతా రామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామి వారి విగ్రహాలను ఉదయం 11:51గం.లకు పునః ప్రతిష్టించి అభిషేకాలు నిర్వహించారు.

అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదలు అందించారు. వేలాదిగా భక్తులు స్వామి వారిని దర్శించుకుని తరించారు. అనంతరం అఖండ అన్నసమారాధన నిర్వహించారు.

ప్రతిష్ఠ లో అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి, అంబుల సాయిబాబు , అంబుల అనుపమ, వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.