The Desk…Vinjamuru : శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం అత్యద్భుతంగా నిర్మిస్తాం  ➖మంత్రి ఆనం

The Desk…Vinjamuru : శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం అత్యద్భుతంగా నిర్మిస్తాం ➖మంత్రి ఆనం

🔴 నెల్లూరు జిల్లా : వింజమూరు : ది డెస్క్ :

బుధవారం ఉదయం వింజమూరు మండలం గుండెమడకల గ్రామంలో శ్రీ సీతారామాంజనేయస్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తుల జయజయ ద్వానాలు వేద పండితుల మంత్రోచ్ఛరణలతో శాస్త్రోక్తంగా నిర్వహించిన హోమం, భూమి పూజ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ తో కలిసి మంత్రి ఆనం పాల్గొన్నారు.

సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ :

గుండెమడకల గ్రామంతో ఆనం కుటుంబానికి మంచి అనుబంధం ఉందని, ఇక్కడ కార్యక్రమం అంటే నెల్లూరు ఏసీ సెంటర్‌లో కార్యక్రమంలానే భావిస్తున్నట్లు ఆనం అన్నారు. ఈ గ్రామంలో ఆలయ నిర్మాణం కోసం గ్రామస్థులు పలుసార్లు విజ్ఞప్తి చేశారని, వారి ఆకాంక్షల మేరకు కోటి రూపాయల టీటీడీ శ్రీవాణి ట్రస్ట్‌ నిధులతో గుండె మడకల గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు.

ఈ మహత్కార్యానికి శ్రీకారం చుట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు. శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని, దేవాదాయశాఖ ఇంజనీరింగ్‌ అధికారులతో ఆలయ నిర్మాణశైలిపై ప్రత్యేక చర్చించి గొప్పగా నిర్మిస్తామని చెప్పారు. ప్రభుత్వం, దాతల సహకారంతో ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం : మంత్రి ఆనం

సోమశిల ఆనం సంజీవరెడ్డి హైలెవల్‌ కెనాల్‌ ద్వారా మెట్టప్రాంత మండలాలైన మర్రిపాడు, వింజమూరు, దుత్తలూరు మండలాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి ఆనం చెప్పారు. సోమశిల హైలెవల్‌ కెనాల్‌పై ఐదురిజర్వాయర్లు ఉండగా ఆరోరిజర్వాయరుగా గుండెమడకలను ఎంపిక చేసినట్లు చెప్పారు. ప్రాధాన్యతక్రమంగా అన్ని రిజర్వాయర్లను పూర్తి చేసి మెట్టప్రాంతాలకు నీటినందిస్తామని చెప్పారు. ప్రతి గ్రామం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ, చిత్తశుద్దితో పనిచేస్తున్నామని చెప్పారు.

సీఎం చంద్రబాబునాయుడు ఈ ఏడాది నుంచే వెలిగొండ పనులు మొదలుపెట్టి రెండేళ్లలో వెలిగొండను పూర్తిచేసేలా అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు మంత్రి ఆనం చెప్పారు. వెలిగొండ పూర్తయితే ప్రకాశం జిల్లాతో పాటు ఉదయగిరి నియోజకవర్గం చివరి మండలాల వరకు సాగు,తాగునీరు పుష్కలంగా లభిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.