The Desk…Vijayawada : 37వ ర‌హ‌దారి భ‌ద్ర‌తా మాసోత్స‌వాల ప్రారంభం

The Desk…Vijayawada : 37వ ర‌హ‌దారి భ‌ద్ర‌తా మాసోత్స‌వాల ప్రారంభం

  • ఈ నెల 1 నుంచి 31వ తేదీ వ‌ర‌కు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు

🔴 ఎన్‌టీఆర్ జిల్లా : విజయవాడ కలెక్టర్ కార్యాలయం : ది డెస్క్ :

ఎన్టీఆర్ జిల్లాను ర‌హ‌దారి ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు స‌మ‌ష్టి భాగ‌స్వామ్యం అవ‌స‌ర‌మ‌ని.. ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వ‌ర‌కు 37వ ర‌హ‌దారి భ‌ద్ర‌తా మాసోత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయ‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. 37వ ర‌హ‌దారి భ‌ద్ర‌తా మాసోత్స‌వాల‌కు సంబంధించిన పోస్ట‌ర్ల‌ను క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ గురువారం క‌లెక్ట‌రేట్‌లో ర‌వాణాశాఖ అధికారుల‌తో క‌లిసి ఆవిష్క‌రించారు.

సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ..

శిక్ష‌ణ‌తో భ‌ద్ర‌త‌, సాంకేతిక‌త ద్వారా ప‌రివ‌ర్త‌న ఇతివృత్తంతో ర‌వాణా శాఖ ఆధ్వ‌ర్యంలో ఈ మాసోత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల భాగ‌స్వామ్యంతో ఈ మాసోత్స‌వాల సంద‌ర్భంగా వివిధ ప్ర‌త్యేక అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. వివిధ ర‌కాల పోటీలు, ర్యాలీలు, స‌మావేశాలు వంటివి నిర్వ‌హించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు.