🔴 ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ : ది డెస్క్ :

ప్రజలకు నాణ్యమైన, సహేతుక ధరలతో ఉత్పత్తులు అందేలా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఆహార, పౌరసరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

మంగళవారం ఆయన విజయవాడ పడమట రైతు బజార్ తనిఖీ చేసి, కూరగాయల ధరలను పరిశీలించారు. మంత్రి ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకున్నారు. అనంతపురం నుంచి సాధారణంగా వస్తున్న గింజ రకం చిక్కుడుకాయలు, గోరుచిక్కుడు, టమాటా వంటి కూరగాయలు అందుబాటులో లేవని వినియోగదారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

దీనిపై స్పందించిన మంత్రి మాట్లాడుతూ..
అన్ని రకాల కూరగాయలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి అని అధికారులకు ఆదేశించారు. బియ్యం మరియు ఇతర ధాన్యాలు నాణ్యతతో విక్రయించాలి అన్నారు. రైతు బజార్ మొత్తం, పరిసర ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలి సూచించారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. మంత్రి పర్యటనలో రైతు బజార్ అధికారి ఎం రమేష్ ఇతర అధికారులు ఉన్నారు.

