- మేధోమదన సదస్సు ద్వారా మిర్చి టమాట పంటలపై రైతులకు అవగాహన..
- ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించాలి..
- రైతులు పంటల సాగులో శాస్త్రీయ విధానాన్ని పాటించాలి..
- నాణ్యమైన పంటలను పండిరచినప్పుడే గిట్టుబాటు ధర లభిస్తుంది..
🔴 ఎన్‌టిఆర్ జిల్లా : విజయవాడ : ది డెస్క్ :
రైతులు పండిరచిన పంటలకు గిట్టుబాటు ధర పొందేలా బహుళ పంటల(మల్టీక్రాప్)ను చేపట్టాల్సిన అవసరం ఉందని టమాట, మిర్చి పంటల రైతులకు సాగులో శాస్త్రీయ విధానం, ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులను సాధించి ఆర్థిక పురోగతిని సాధించేలా మేధోమదన సదస్సును నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ తెలిపారు.
రాష్ట్ర ఉద్యానశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని జలవనరుల శాఖ కార్యాలయ ఆవరణంలోని రైతు శిక్షణ కేంద్రం నందు రాష్ట్రానికి చెందిన మిర్చి, టమాట రైతులకు అవగాహన కల్పించేందుకు ఉద్యాన అధికారులు, శాస్త్రవేత్తలు ఎగుమతి దారులతో నిర్వహించిన మేధోమదన సదస్సుకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని జ్వోతిప్రజ్వలన చేసిన చేసారు.
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లాడుతూ…
రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. ఉద్యాన రైతులకు మార్కెట్ సౌకర్యం కల్పించి సరైన గిట్టుబాటు ధర కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారన్నారు. ఆయన ఆలోచనల మేరకు టమాట, మిర్చి పంటలను పండిరచే రైతులకు పంటల దిగుబడి, మార్కెటింగ్, గిట్టుబాటు ధర వంటి విషయాలలో అవగాహన కల్పించేందుకు మేధోమదన సదస్సును నిర్వహిస్తున్నామన్నారు.
ముఖ్యంగా రైతులు ఎప్పుడు ఒకే రకమైన పంటలను కాకుండా బహుళ పంటలు (మల్టీక్రాప్)ను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. చేపట్టే పంటలపై రైతుకు అవగాహన కలిగి ఉండాలన్నారు. నాణ్యమైన విత్తనం, మొక్కల ఎంపిక నుండి నాటడం, పోషణ వంటి విషయాలపై శాస్త్రీయ విధానాన్ని పాటించాలన్నారు. ప్రకృతి వ్యవసాయ విధానాలను పాటించినప్పడే నాణ్యమైన దిగుబడులను పొందగలుగుతారని తద్వారా గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంటుందన్నారు.
శాస్త్రీయ సాగు పద్దతులు, ప్రకృతి వ్యవసాయం, మార్కెట్ సౌకర్యం వంటి విషయాలపై రైతులు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏ సమయంలో పంటలు చేపడితే మార్కెట్‌లో డిమాండ్ కలిగి గిట్టుబాటు ధర లభిస్తుందనే విషయంలో వ్యవసాయ ఉద్యాన శాస్త్రవేత్తల అందించిన సలహాలు, సూచనలు పాటించాలన్నారు. ఉదాహరణకు ఇటీవల ఒకానొక సమయంలో టమాట ధర అధికంగా ఉండడంతో పంటకు కాపాలదారుడును ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిరదని అదే మరోక సమయంలో పంటకు ధర లేక పంట కోసి రోడ్లపై విడిచే పరిస్థితి ఏర్పడిరదన్నారు.
ఇటువంటి వ్యత్యాసం రావడానికి గల కారణాలు రైతులకు తెలిసినప్పుడు గిటుబాటు ధర లభించే సమయానికి పంటలు చేపట్టే అవకాశం ఉంటుందన్నారు. సరైన గిట్టుబాటు ధర లభించాలంటే పండిరచే పంటలో నాణ్యత ప్రమాణాలు ఉండాలన్నారు. మోతాదుకు మించి రసాయనిక ఎరువులు పురుగుమందులు వాడడం వలన వాటి అవశేషాల కారణంగా పంట త్వరగా పాడైపోవడంతో పాటు ఎగుమతుల సమయంలో ధర తగ్గిపోవడం జరుగుతుందన్నారు. దీనిని నివారించేందుకు ప్రకృతి వ్యవసాయ పద్దతులను పాటిస్తూ నాణ్యమైన పంటలు పండిరచి గిట్టుబాటు ధర పొందడం ఒక్కటే మార్గమన్నారు. రైతులను ఆదుకునేందుకు స్థానికంగానే ప్రాసెసింగ్ యూనిట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికి రైతులు పంట నష్టపోవడం దురదృష్టకరమన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు శాస్త్రవేత్తల ద్వారా రైతులకు సరైన సమాచారం పొందాలన్నారు. ఈదురు గాలుల తీవ్రత నుండి పంటను రక్షించుకునేందుకు విండ్ బ్రేకర్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రత్యక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ తెలిపారు.
రాష్ట్ర ఉద్యాన, పట్టుపురుగుల పెంపక శాఖ డైరెక్టర్ డా. కె. శ్రీనివాసులు మాట్లాడుతూ..
టమాట మిర్చి రైతుల తో సదస్సు నిర్వహించడానికి గల ముఖ్య కారణం మిర్చి పంట సాగులో రైతులు ఎదుర్కొంటున్న సవాళ్ళును అధిగమించేలా అవగాహన కల్పించడమేనన్నారు. ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. మన రాష్ట్రంలో 12 లక్షల మంది రైతులు 6 లక్షల హెక్టార్లలో ప్రకృతి సేద్యం నిర్వహిస్తున్నారన్నారు. ప్రపంచ వ్యప్తంగా జపాన్, జర్మనీ, యూరప్ కు చెందిన అనేక మంది శాస్త్రవేత్తలు ప్రకృతి సేద్యాన్ని ప్రసంశిస్తున్నారన్నారు. రైతులు మోనోక్రాప్ వైపు కాకుండా మల్టీక్రాప్ వైపు దృష్టి సారించాలన్నారు. ఒకే పంట కాకుండా రెండు నుంచి మూడు పంటలు పండిరచడం ద్వారా రైతు లాభాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. డెల్టా ప్రాంత రైతులు అంతర పంటలగా ఆయిల్ ఫామ్, కోకో పంటలను పండిస్తున్నారని శ్రీనివాసులు తెలిపారు.
సదస్సులో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ రాష్ట్ర సంచాలకులు విజయ సునీత, ఉద్యాన శాఖ అదనపు సంచాలకులు యం. వెంకటేశ్వర్లు, డా. అశోక్‌కుమార్, హరినాథ్‌రెడ్డి, ఐసిఎఆర్ డైరెక్టర్ యం శేషుమాధవ్, డా. వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ డా. వెంకట రమణ, ఐటిసి మేనేజర్ విష్ణువర్థన్, ఉద్యాన శాఖ శాస్త్రవేత్త డా. శీరిష్, జిల్లా ఉద్యాన అధికారి బాలాజీ కుమార్, ఉద్యాన అధికారులు, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన టమటా మిర్చి రైతులు, కొనుగోలు, ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులు పాల్గొన్నారు.