యువ క్రికెటర్లకు ఆదర్శం…
–ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ : ది డెస్క్ :
14 ఏళ్ల వయస్సులో ఐపీఎల్ లో క్రికెట్ ఆడటమే కాకుండా కేవలం 35 బంతుల్లో సెంచరీ సాధించి అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన యువక్రికెటర్ వైభవ్ సూర్యవంశీ పై ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్నీ) హర్షం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా వేదికగా యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ప్రతిభను ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రశంసించారు. అతి చిన్న వయస్సులోనే దేశ వ్యాప్తంగా మాత్రమే కాక ప్రపంచ స్థాయిలో వైభవ్ సూర్య వంశీ గుర్తింపు సాధించటంతో చాలా ఆనందంగా వుందన్నారు. వైభవ్ సూర్యవంశీ చక్కటి ప్రతిభ కనబర్చారని కొనియాడారు. మంచి భవిష్యత్తు వుంటుందని, మరెన్నో రికార్డులు సాధించాలని చిన్ని ఆకాంక్షించారు.
ఎపి నుంచి ఇలాంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లను వెలికి తీసేందుకు ఏసీఏ కృషి చేస్తుందని తెలిపారు. వైభవ్ సాధించిన సెంచరీ ఆయన క్రమశిక్షణ, నిబద్ధత, పట్టుదలకి నిదర్శనమని కొనియాడారు. యువ క్రికెటర్లు సూర్య వంశీని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు.